అమరజీవి కామ్రేడ్ మహమ్మద్ గౌస్ గారి ద్వితీయ వర్ధంతి సభ, స్థూపావిష్కరణ పోస్టర్లను విడుదల
హైదరాబాద్ అక్షిత బ్యూరో : బహుజన బంధువు, పీడిత వర్గాల ఆశాజ్యోతి ఎంసిపిఐ(యు)పార్టీ అఖిల భారత ప్రధాన కార్యదర్శి అమరజీవి కామ్రేడ్ హమ్మద్ గౌస్ గారి స్థూపావిష్కరణ ద్వితీయ వర్ధంతి సభను జయప్రదం చేయండి- ఎంసిపిఐ(యు) గ్రేటర్ హైదరాబాద్ కమిటీ సహాయ కార్యదర్శి తుడుం అనిల్ కుమార్ పిలుపు
ఈరోజు ఎంసిపిఐయు గ్రేటర్ హైదరాబాద్ కమిటీ ఆధ్వర్యంలో పార్టీ మాజీ అఖిల భారత ప్రధాన కార్యదర్శి అమరజీవి కామ్రేడ్ మహమ్మద్ గౌస్ గారి ద్వితీయ వర్ధంతి సభ, స్థూపావిష్కరణ పోస్టర్లను విడుదల చేయడం జరిగింది. అనంతరం తుడుం అనిల్ కుమార్ మాట్లాడుతూ గౌస్ గారు1965లో వరంగల్ జిల్లా కొత్తూరు గ్రామంలో పేద మైనార్టీ కుటుంబంలో జన్మించారని,ఆ రోజుల్లోనే హిందీ పండిత్ ఎంఏ వరకు చదివారని,చదువుకునే సమయంలోనే విద్యార్థి ప్రజా ఉద్యమాలకు ఆకర్షితులై 1980 ప్రాంతంలో యువజన సంఘం లో చేరి యువతను సమీకరించి అనేక మూఢవిశ్వాసాలకు, సామాజిక దురాచారాలకు వ్యతిరేకంగా ఉద్యమాలు చేస్తూనే నాటికలు ఇతర సాంస్కృతిక కార్యక్రమాలలో తర్ఫీదు పొంది విద్యార్థి, యువతను ప్రజలను చైతన్య పరచారని, కొత్తూరు గ్రామ అభివృద్ధికి ప్రత్యేక కార్యక్రమాలు రూపొందించి వచ్చిన డబ్బులతో స్కూలు తరగతులు పెంచుటకు కృషి చేసినారని, 1982లో సిపిఐఎం లో సభ్యత్వం తీసుకొని 1983 నాటికి నాటి వరంగల్ తాలూకా కమిటీ సభ్యునిగా ఎదిగినారని,సిపిఐఎం నాయకత్వం ఎంసి పిఐయు వ్యవస్థాపక నేత అమరజీవి కామ్రేడ్ మద్ది కాయల ఓంకార్ గారి పై అనాలోచిత చర్యలు తీసుకున్నప్పుడు 1984లో ఎంసీపీఐ పార్టీలో భాగస్వామ్యం అయినారని ఎంసీపీఐ పార్టీ జిల్లా,రాష్ట్ర,కేంద్ర నాయకునిగా అభివృద్ధి అయి పార్టీ సెంట్రల్ కంట్రోల్ కమిషన్ చైర్మన్ గా 2012-2015 వరకు పార్టీ తెలంగాణ రాష్ట్ర కార్యదర్శిగా2016 మార్చి6,7 తేదీలలో విజయవాడలో జరిగిన పార్టీ అఖిల భారత ప్లీనరీ సమావేశాలలో అఖిల భారత కార్యదర్శిగా ఎన్నికై పార్టీని అనేక రాష్ట్రాలలో బలోపేతం చేయుటకు శక్తివంచన లేకుండా పని చేశారని, 2019 ఫిబ్రవరి 15-18 తేదీలలో కేరళ రాష్ట్రంలోని కొచ్చిన్ లో జరిగిన పార్టీ అఖిల భారత మహాసభలలో రెండవసారి అఖిల భారత కార్యదర్శిగా ఎన్నికై ఎంసీపీయూ సిద్ధాంత పునాది అయినా భారతదేశంలో కమ్యూనిస్టుల ఐక్యత, ఐక్య ఉద్యమ అవసరాన్ని సిపిఐ, సిపిఐఎం,ఇతర వామపక్ష నాయకత్వాన్ని కలిసి ఐక్య ఉద్యమాల నిర్మాణానికి కృషిగావించచారని, ఎంసిపిఐయు పార్టీ కార్యక్రమం 1951 ఎత్తుగడల పంథా పై ఏకాభిప్రాయం ఉన్న శక్తుల కలయిక కై చేసిన కృషిలో భాగంగా దేశంలో వివిధ రాష్ట్రాల లో ప్రజా పునాది కలిగి ఉన్న ఆర్ఎంపిఐ పార్టీతో చర్చలు జరిపి ఎంసిపిఐయు, ఆర్ఎంపిఐ పార్టీల ఐక్యకారచరణను విలీన దిశగా రూపొందించినారని, అమరజీవి గౌస్ గారు ప్రజా ఉద్యమం పునాదిలో చొచ్చుకొని పనిచేస్తున్న తీరుతో బెంబేలెత్తిన నాటి భూస్వామ్య, పెత్తందారులు,నక్సలైట్లు అందులో ముఖ్యంగా పీపుల్స్ వారి పేరుతో పనిచేసిన వారు కలిసికట్టుగా కక్ష కట్టి పార్టీ పై,నాయకత్వంపై కామ్రేడ్ గౌస్ గారిపై చేసిన దాడులు, హత్యలు,అక్రమ కేసులు వర్ధన్నపేట ప్రాంతం ల్యాబర్తి, కక్కిరాలపల్లి,కొత్తూరు, సన్నూరు,పెరికేడు నందనం,గుర్తూరు, గుత్పల తమ్మడపల్లి తదితర గ్రామాలలో పెద్ద ఎత్తున సాగాయని, అమరవీరులు కామ్రేడ్స్ పోలం గోపాల్ రెడ్డ పోగుల ఆగయ్య, పెరుమండ్ల జగన్నాథం గార్లను దారుణంగా కాల్చి హత్య గావించారని,ఇదే సందర్భంలో కొత్తూరు గ్రామం పై అనేకసార్లు దాడులు జరిగాయని ఈ దుర్మార్గులు పిస్తోలుతో కాల్చిన కాల్పులలో కామ్రేడ్ ఎండి గౌస్ గారు తృటిలో ప్రాణాపాయం తప్పిందని,గ్రామ కార్యకర్తలకు దెబ్బలు తగిలాయని ల,వీరిపై అనేకసార్లు హత్య ప్రయత్నాలే కాకుండా, వివిధ సెక్షన్ల కింద సుమారు 36 కేసులలో వీరితోపాటు 180 మంది కార్యకర్తలను ఇరికించి జైలుకు పంపినారని,తప్పుడు కేసులతో అమరజీవి కామ్రేడ్ గౌస్ గారిపై మరికొందరు కార్యకర్తలపై శిక్ష పడి పై కోర్టులలో కొట్టివేయ బడ్డాయని,ఇలా అమరవీరుల రక్తతర్పణలో ఏర్పడి నిలబడిన ఎంసీపీఐయు పార్టీ జాతీయ ప్రధాన ప్రధాన కార్యదర్శి గా పార్టీని పదవుల కోసం తోకలుగా ల,తొత్తులుగా మారకుండా కమ్యూనిస్టు,సామాజిక శక్తుల ఐక్యం చేస్తూ అగ్రవర్ణ,ఆదిపత్య,ధనిక వర్గబూర్జువ,భూస్వామ్య విధానం రద్దు అయ్యే వరకు ఆర్థిక, సామాజిక,రాజకీయ న్యాయం,బహుజనులకు రాజ్యాధికారం రావాలని నిబద్దతతో పార్టీని నిర్మాణం గావించిన అమరజీవి కామ్రేడ్ ఎండి గౌస్ గారు 2021 ఏప్రిల్ 19వ తేదీన అనారోగ్యంతో మరణించారని,వారి మృతి ఎంసిపిఐ పార్టీకే కాకుండా యావత్తు ప్రజా ఉద్యమాలకు ఎనలేని నష్టమని వారి త్యాగాల పోరాట జీవితాన్ని భవిష్యత్ తరాలకు అందించే లక్ష్యంతో వారి స్వగ్రామం కొత్తూరు వరంగల్ జిల్లాలో 51 ఫీట్ల స్థూపావిష్కరణ మరియు రెండవ వర్ధంతి బహిరంగ సభను ఈనెల 19న నిర్వహిస్తున్నామని,ఈ బహిరంగ సభకు పెద్ద ఎత్తున ప్రజలు, కార్యకర్తలు తరలిరావాలని సభను విజయవంతం చేయాలని అన్నారు.
ఈ కార్యక్రమంలో తాండ్ర కళావతి ,పల్లె మురళి, అంగడి పుష్ప ,ఇ దశరథ నాయక్ ,కన్నా శ్రీనివాస్, బి విమల ,తుడుం పుష్పలత ,జి శివాని ,ఎండి సుల్తానా, బేగం రజియా బేగం తదితరులు పాల్గొన్నారు.