కొనసాగుతున్న అంబెడ్కర్ జయంతి ఉత్సవాలు.
రాజేంద్రనగర్,అక్షిత ప్రతినిధి:
డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ జయంతి ఉత్సవాల కొనసాగింపులో భాగంగా డివైఎఫ్ఐ, ఎస్ఎఫ్ఐ, మహిళా సంఘం నాయకత్వంలో బైకు ర్యాలీ నిర్వహించడం జరిగింది. వెంకటేశ్వర కాలనీ నుండి శ్రీరామ నగర్, నేతాజీ నగర్ తదితర బస్తీలు తిరుగుతూ “రాజ్యాంగాన్ని రక్షించుకుందాం” , “ప్రజాస్వామ్యాన్ని. కాపాడుకుందాం”, “డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ఆశాలను కొనసాగిద్దాం” అంటూ బైక్ ర్యాలీ నోర్వహించారు.
బైకు ర్యాలీ కార్యక్రమంలో సిపిఎం పార్టీ రాజేంద్రనగర్ మండల కార్యదర్శి జిఎం. కురుమయ్య ప్రారంభ సూచకగా జెండా ఊపి ర్యాలీని ప్రారంభించారు. బి.రాఘవేంద్ర అధ్యక్షతన ముగింపు సభ జరిగింది. సభలో జిఎం కురుమయ మాట్లాడుతూ.. యువతి యువకులు అంబేద్కర్ గారి ఆలోచనలను నిజాయితీగా సాగించాలని కోరారు ప్రస్తుత పరిస్థితులలో భారతదేశం ఇబ్బందికర పరిస్థితిలో ఉన్నదని.. అలాగే తెలంగాణ రాష్ట్రానికి ముప్పు పొంచి ఉన్నదని యువతి యువకులు చైతన్యవంతులుగా . మంచి దారిలో ప్రయాణించాలని చెడు వ్యసనాలకు లోను కాకుండా మూఢవిశ్వాసాల వైపు వెళ్లకుండా న్యాయపరమైన దారిలో నడవాలని అన్నారు. రాజ్యాంగాన్ని గౌరవిస్తూ రాజ్యాంగాన్ని రక్షించుకోవాలని ఈ బాధ్యత యువతీ యువకులదేనని అన్నారు. అధికారంలో ఉన్న బిజెపి మోడీ ప్రభుత్వం సంవత్సరానికి రెండు కోట్ల ఉద్యోగాలు ఇస్తామని నమ్మబలికి ఉన్న ఉద్యోగాలను ఉడతిస్తుందని అన్నారు. 8 సంవత్సరాల. మోడీ పాలన లో అభివృద్ధి జరగపోగా నోట్ల రద్దు జీఎస్టీ వల్ల ప్రజలపై మోయలేని బారాలు పడ్డాయని అన్నారు. బిజెపి అధికరానికి వస్తే . విదేశీ బ్యాంకుల్లో దాచి ఉన్న నల్లధనాన్ని తెచ్చి ప్రతి కుటుంబానికి . 15 .లక్షలు వేస్తామని జన్ధన్ ఖాతాలు తెరవాలని పిలుపునిచ్చారు. ఈ మాటలన్నీ నీటి మూటలుగానే మిగిలి పోయాయి తప్ప ప్రజలకు ఒరిగిందేమీ లేదని అన్నారు. డివైపే మండల కార్యదర్శి జి చైతన్య మాట్లాడుతూ కేంద్ర రాష్ట్ర పాలకులు ఈ పాలకులు ఇప్పటికైనా బాధలు గుర్తెరిగి ఉద్యోగాలు ఇవ్వాలని లేనిచో 2024 జరగబోయే పార్లమెంటు ఎన్నికల్లో మోడీని ఇంటికి పంపుతామని అన్నారు. ఇంకా ఈ కార్యక్రమంలో డివైఎఫ్ఐ మండల ఉపాధ్యక్షులు C. బాలకృష్ణ, డి సూర్య. సహాయ కార్యదర్శి జిఎం మధు, జి చరణ్ ఎస్ఎఫ్ఐ మండల నాయకులు. బి రాకేష్. ఆనందు , బంటి. కెవిపిఎస్ మండల సహాయ కార్యదర్శి ఎన్ మొగులయ్య నాగయ్య. నాయకురాలు జి అనసూయ. బి అనిత , జి సమిత, లక్ష్మీ, జయమ్మ. దేవ కుమారి. సుమారు 35 బైకులు ర్యాలీలో పాల్గొన్నాయి. విప్లవ అభినందనలతో. జిఎం కురుమయ్య మండల కమిటీ మరియు మహిళా సంఘం.నేతలు పాల్గొన్నారు.