సీఎం సహాయనిధి పేదల పాలిట వరం 2 లక్షల 50 వేల రూపాయల విలువగల ఎల్ ఓ సి చెక్కు అందజేత నిరుపేదల ఆపద్బాంధవుడు సీఎం కేసీఆర్.. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ విప్ రేగా కాంతారావు
సీఎం సహాయనిధి పేదల పాలిట వరం
2 లక్షల 50 వేల రూపాయల విలువగల ఎల్ ఓ సి చెక్కు అందజేత
నిరుపేదల ఆపద్బాంధవుడు సీఎం కేసీఆర్.. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ విప్ రేగా కాంతారావు
పినపాక అక్షిత ప్రతినిధి:
హైదరాబాద్ అసెంబ్లీలోని తన ఛాంబర్ నందు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పినపాక నియోజకవర్గం బూర్గంపాడు మండలం మొరంపల్లి బంజర గ్రామానికి చెందిన కే. సీతారామయ్య అనారోగ్య కారణంగా అత్యవసర చికిత్స నిమిత్తం వైద్య ఖర్చులకోసం సీఎం సహాయ నిధి పథకం కింద ఎల్ఓసి ద్వారా మంజూరైన 2 లక్షల 50 వేల రూపాయల విలువగల చెక్కును తెలంగాణ ప్రభుత్వ విప్ పినపాక శాసనసభ్యులు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా బిఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు రేగా కాంతారావు వారి చేతుల మీది గా అందజేయడం జరిగింది.
ఈ సందర్భంగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ విప్ రేగా కాంతారావు మాట్లాడుతూ
నిరుపేదల ఆపద్బాంధవుడు సీఎం కేసీఆర్ అని అన్నారు. ప్రజలు సీఎం రిలీఫ్ ఫండ్ సద్వినియోగం చేసుకోవాలని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నిరంతరం పేదల సంక్షేమం కోసం అభివృద్ధి కోసం కృషి చేస్తుందన్నారు. దేశంలో ఎక్కడా లేనివిధంగా తెలంగాణ రాష్ట్రంలో అనేక సంక్షేమ పథకాలు పెట్టడం జరిగిందన్నారు. ఆపదలో ఉన్న ప్రతి పేద కుటుంబానికి ఆదుకునేందుకు సీఎం కేసీఆర్ మానస పుత్రిక అయినటువంటి కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ తో పాటు రైతుబంధు, దళిత బంధువు అంటే అనేక సంక్షేమ పథకాలతో దేశంలోని నవ శకానికి నాంది పలికిన అపర భగీరథుడు సీఎం కేసీఆర్ అన్నారు, నిరుపేద కుటుంబాల వైద్య ఖర్చులు నిమిత్తం అప్పులు చేసి అనేక ఇబ్బందులు పడుతున్న నేపథ్యంలో ముఖ్యమంత్రి సహాయ నిధి ద్వారా నగదు మంజూరు చేసి భరోసా కల్పిస్తున్నామన్నారు. ప్రజా సంక్షేమ ద్యేయంగా పనిచేస్తున్నది అన్నారు. పినపాక నియోజకవర్గం లో వేలాదిమంది పేద మధ్యతరగతి ప్రజలకు సీఎం సహాయ నిధి ద్వారా ఆర్థిక చేయూతన అందించడం జరుగుతున్నది అన్నారు.