అనాధ బాలలకు సేవ అభినందనీయం
వరంగల్,అక్షిత బ్యూరో : విలియం కేరి సోషల్ ఆర్గనైజేషన్ ఆధ్వర్యంలో శిశు గృహలో ఉన్న చిన్నారులకు రెండు జతల దుస్తులు అందజేసినట్లు సంస్థ నిర్వాహకులు జన్ను క్రాంతి అరుణ్ తెలియజేసినారు ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా చైల్డ్ వెల్ఫేర్ కమిటీ సభ్యుడు పరికి సుధాకర్ పాల్గొని మాట్లాడుతూ ఏ ఆధారం లేని చిన్నారులకు రెండు జతల దుస్తులు అందించడం సంతోషించేదగ్గ విషయమని సామాజిక సేవా కార్యక్రమాల్లో విలియం కేరి ఆర్గనైజేషన్ మై ఛాయిస్ సంస్థ నిర్వాహకులు తమ సేవలు నిర్వహించడం అభినందించనీయమని అన్నారు ఈ కార్యక్రమంలో బ్రాంచ్ మేనేజర్ నగేష్ సోషల్ వర్కర్ చైతన్య సంస్థ నిర్వాహకులు మాజీ కార్పొరేటర్ జన్ను ఆరోను తదితరులు పాల్గొన్నారు.