బిఆర్ఎస్ మండల పార్టీ కార్యకర్తల విస్తృతస్థాయి సమావేశం

బిఆర్ఎస్ మండల పార్టీ కార్యకర్తల విస్తృతస్థాయి సమావేశం

చౌటుప్పల్, అక్షిత ప్రతినిధి:

చౌటుప్పల్ పట్టణంలోని బిఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో మండల పార్టీ అధ్యక్షులు, మున్సిపాలిటీ అధ్యక్షులు, గ్రామ అధ్యక్షులు, వార్డు అధ్యక్షులు ముఖ్య నాయకుల సమావేశం గిర్కంటి నిరంజన్ గౌడ్, ముత్యాల ప్రభాకర్ రెడ్డి అధ్యక్షతన నిర్వహించడం జరిగింది. ఈ సమావేశంలో ఏప్రిల్ 18న చౌటుప్పల్ పట్టణంలో 100 పడకల ఆసుపత్రి శంకుస్థాపన, బిఆర్ఎస్ పార్టీ ఆత్మీయ సమ్మేళన కార్యక్రమాల్లో పాల్గొనటానికి రాష్ట్ర ఆర్థిక, ఆరోగ్య శాఖ మంత్రి తన్నీరు హరీష్ రావు పాల్గొంటారు కావున బిఆర్ఎస్ పార్టీ కుటుంబ సభ్యులు హాజరు, ఆత్మీయ సమ్మేళనం ఏర్పాట్ల గురించి విస్తృతంగా చర్చించడం జరిగింది. కావున గ్రామాల నుండి బిఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు అధిక సంఖ్యలో పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరారు. ఈ సమావేశంలో చౌటుప్పల్ మున్సిపల్ చైర్మన్ వెన్ రెడ్డి రాజు, సింగిల్ విండో చైర్మన్ చింతల దామోదర్ రెడ్డి, మాజీ మార్కెట్ చైర్మన్ బొడ్డు శ్రీనివాస్ రెడ్డి, ట్రేడ్ యూనియన్ జిల్లా అధ్యక్షులు ఢిల్లీ మాధవరెడ్డి, మండల పార్టీ ఉపాధ్యక్షులు చిన్నం బాలరాజు, కార్యదర్శి అల్మాస్ పేట కృష్ణ, గుండెబోయిన వెంకటేష్, బొమ్మిరెడ్డి వెంకటరెడ్డి, మాజీ సర్పంచ్ బొంగు జంగయ్య గౌడ్, బొడిగె ఆనంద్ గౌడ్, బుడిగ బాలకృష్ణ, సుల్తాన్ రాజు, దొడ్డి లింగస్వామి తదితరులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.

Breaking