సింగరేణి ఓబి వర్కర్ల సమస్యలు పరిష్కరించాలి మణుగూరు ఏరియా కాంటాక్ట్ కార్మిక సంఘాల జేఏసీ డిమాండ్

సింగరేణి ఓబి వర్కర్ల సమస్యలు పరిష్కరించాలి

మణుగూరు ఏరియా కాంటాక్ట్ కార్మిక సంఘాల జేఏసీ డిమాండ్

పినపాక అక్షిత ప్రతినిధి:

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మణుగూరు ఏరియా లో వివిధ ఓబీలలో పనిచేస్తున్న ఓ బి వర్కర్ల చట్టబద్ధ హక్కులు, వేతనాలు, ఉద్యోగ భద్రత, సంక్షేమం, రక్షణ,స్థానికులకు 80% ఉద్యోగ అవకాశాలు కల్పించాలని. మణుగూరు ఏరియా కార్మిక సంఘాల జేఏసీ నాయకులు ఓ బి కంపెనీల యాజమాన్యాలను డిమాండ్ చేశారు.
శనివారం స్థానిక ఐఎఫ్ టి యు కార్యాలయంలో జరిగిన సింగరేణి కాంట్రాక్ట్ కార్మిక సంఘాల జేఏసీ సమావేశంలో నాయకులు ఈ డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా జేఏసీ నాయకులు మాట్లాడుతూ మణుగూరు ఓబీలలో వివిధ విభాగాలలో స్థానికులకు ఉద్యోగ అవకాశాలు ఇవ్వకుండా స్థానికేతర్లకు ఉద్యోగ అవకాశాలు కల్పించడం సరైనది కాదని చట్టం ప్రకారం వేతనాలు, సౌకర్యాలు, మెడికల్ బుక్స్, సంక్షేమం , పని భద్రత, రక్షణ తదితర హక్కులు కల్పించకపోవడం బాధాకరమని జేఏసీ నాయకులు అభిప్రాయపడ్డారు. ప్రిన్సిపుల్ ఎంప్లాయర్ గా సింగరేణి యాజమాన్యం వీటి మీద దృష్టి పెట్టి ఓబి యాజమాన్యాలతో మాట్లాడి సామరస్య ధోరణిలో సమస్యలను పరిష్కరించాలని కోరారు. తిరిగి 16వ తేదీన జేఏసీ సమావేశం జరిపి భవిష్యత్తు కార్యా చరణ రూపొందించుకోవాలని జేఏసీ నాయకులు ఏకగ్రీవంగా తీర్మానించారు. ఈ సమావేశంలో ఐ ఎఫ్ టి యు రాష్ట్ర నాయకులు ఎండి రాసుద్దీన్, ఎల్ విశ్వనాథం,ఏఐటీయూసీ నాయకులు తోట రమేష్, సిఐటియు నాయకులు ఉప్పు తల నరసింహారావు, ఐ ఎన్ టి యు సి నాయకులు వెలకపల్లి జాన్, పొదిలి వీరభద్రం, పి నవీన్, చందా సంతోష్, ఐ ఎఫ్ టి యు అనుబంధ సింగరేణి కాలరీస్ కాంట్రాక్ట్ వర్కర్స్ యూనియన్ ఏరియా అధ్యక్షులు ఏ మంగి లాల్
మరియు వివిధ ఓబి లలో పనిచేస్తున్న ఓ బి వర్కలు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.

Breaking