ధాన్యం కొనుగోళ్లపై కంట్రోల్ రూం కలెక్టరేట్ డిఎస్.ఓ కార్యాలయంలో కంట్రోల్ రూం ప్రారంభించిన అదనపు కలెక్టర్ భాస్కర్ రావు కంట్రోల్ రూం నంబర్ 9963407064

ధాన్యం కొనుగోళ్లపై కంట్రోల్ రూం

కలెక్టరేట్ డిఎస్.ఓ కార్యాలయంలో కంట్రోల్ రూం ప్రారంభించిన అదనపు కలెక్టర్ భాస్కర్ రావు

కంట్రోల్ రూం నంబర్ 9963407064

నల్గొండ, అక్షిత ప్రతినిధి :

యాసంగి 2022 – 23 సీజన్ కు సంబందించి ధాన్యం కొనుగోళ్ల కు సంబందించి జిల్లా కలెక్టరెట్ లోని జిల్లా పౌర సరఫరాల అధికారి కార్యాలయంలో ఏర్పాటు చేసిన కంట్రోల్ రూం ను అదనపు కలెక్టర్(రెవెన్యూ) భాస్కర్ రావు శనివారం ప్రారంభించారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కంట్రోల్ రూం నంబర్ 9963407064 కు ఫోన్ చేసి ధాన్యం కొనుగోళ్ల కు సంబందించి సమస్యలు తెలుప వచ్చని తెలిపారు. కొనుగోలు కేంద్రాలలో, రైస్ మిల్లులు యందు కాని ఎటువంటి సమస్యలు తలెత్తిన కంట్రోల్ రూం నెంబర్ కు ఫోన్ చేసి తెలిపిన వెంటనే సమస్యను నమోదు చేసుకొని సంబంధిత అధికారి దృష్టికి తీసుకు వెళ్లి సమస్య పరిష్కారం చేయ నున్నట్లు వెల్లడించారు. కంట్రోల్ రూం ఉదయం 8 గంటల నుండి సాయంత్రం 8 గంటల వరకు పని చేస్తుందని, కంట్రోల్ రూం లో పౌర సరఫరాల శాఖ, వ్యవ సాయ శాఖ,సహకార శాఖ,జిల్లా గ్రామీనాభివృద్ది శాఖ సిబ్బంది ఉంటారని తెలిపారు.


జిల్లాలో పి. ఏ.సి.ఎస్.(PACS) ద్వారా 151, ఐ.కె.పి.ద్వారా 121 మొత్తం 272 ధాన్యం కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు కు గాను ఇప్పటికే ఐ. కె.పి 82 ,పి. ఏ.సి.ఎస్.55,మొత్తం 137 కొనుగోలు కేంద్రాలు కొనుగోళ్లు ప్రారంభించి,ట్యాబ్ ఎంట్రీ లు కూడా ఆన్ లైన్ లో నమోదు కు ఏర్పాట్లు చేసినట్లు తెలిపారు. మిగతా కొనుగోలు కేంద్రాలు కూడా వెంటనే ప్రారంభించి ధాన్యం కొనుగోళ్లకు చర్యలు తీసుకోవాలని అన్నారు.
ఈ యాసంగి సీజన్ నందు 8 లక్షల మెట్రిక్ టన్నులు ధాన్యం కొను గోలు కేంద్రాలకు వస్తుందని వ్యవసాయ శాఖ అధికారులు అంచనా వేసినట్లు, 272 కొనుగోలు కేంద్రాలకు 109 రైస్ మిల్లులు ట్యాగింగ్ చేసినట్లు, కొనుగోళ్లకు సంబందించి రైతు వారీగా ట్యాబ్ ఎంట్రీ ఆన్ లైన్ లో ఓ.పి.యం.ఎస్ ద్వారా చేయటానికి ఏర్పాట్లు చేసినట్లు తెలిపారు.ఈ కార్యక్రమం లో జిల్లా పౌర సరఫరాల అధికారి వెంకటేశ్వర్లు,పౌర సరఫరాల డి.యం.నాగేశ్వర్ రావు,జిల్లా సహకార అధికారి రాజేందర్ రెడ్డి, వ్యవసాయ శాఖ జె.డి.సుచరిత,మార్కెటింగ్ అధికారి శ్రీకాంత్ తదితరులు పాల్గొన్నారు.

*పి.ఏసిఎస్. కేంద్రాల
ట్యాబ్ ఆపరేటర్ లకు శిక్షణ

పి. ఏ.సి.ఎస్.కొను గోలు కేంద్రాల ట్యాబ్ ఆపరేటర్ లకు ట్యాబ్ ఎంట్రీ లు నమోదు పై జిల్లా కేంద్ర సహకార బ్యాంక్ కార్యాలయంలో శనివారం శిక్షణ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్ భాస్కర్ రావు మాట్లాడుతూ కొనుగోళ్ల కు సంబందించి రైతు వారీగా ట్యాబ్ ఎంట్రీ లు ఆన్ లైన్ ఓ.పి.యం.ఎస్ లో ఎటువంటి తప్పులకు ఆస్కారం లేకుండా పూర్తి వివరాలు నమోదు చేయాలని అన్నారు. ట్యాబ్ ఎంట్రీ నమోదు ప్రతి రోజు జరిగేలా సంబంధిత అధికారులు పర్యవేక్షించాలని అదనపు కలెక్టర్ అధికారులను ఆదేశించారు. ఈ కార్యక్రమంలో జిల్లా సహకార అధికారి రాజేందర్ రెడ్డి, జిల్లా పౌర సరఫరాల అధికారి వెంకటేశ్వర్లు,జిల్లా పౌర సరఫరాల డి యం.నాగేశ్వర్ రావు తదితరులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.

Breaking