12రకాల సరుకులు ఇవ్వాలని రేషన్ తహశీల్దార్ కు వినతి

12రకాల సరుకులు ఇవ్వాలని రేషన్ తహశీల్దార్ కు వినతి

ఖమ్మం/ అక్షిత బ్యూరో :

రేషన్ షాపుల ద్వారా ప్రజలకు 12 రకాల నిత్యావసర సరుకులు ఇవ్వాలనీ పీ ఓ డబ్ల్యూ పీ వైఎల్ ప్రతినిధి బృందం శనివారం నేలకొండపల్లి తహశిల్దార్ కు వినతిపత్రం ఇచ్చారు.ఈ సందర్భంగా పీ వై ఎల్ నాయకులు కనకపూడి రవికుమార్ మాట్లాడుతూ రేషన్ షాపుల్లో సన్నబియ్యం ఇవ్వాలని దరఖాస్తు చేసుకున్న వారికి రేషన్ కార్డులు మంజూరు చేయాలని
గ్యాస్ సిలిండర్లు సగం సబ్సిడీతో (రూ. 500/- లకి) ఇవ్వాలని ఆయన డిమాండ్ చేశారు.ఈ కార్యక్రమంలో సామాజిక కార్యకర్త పసుమర్తి శ్రీనివాస్ ఎల్ రాజశేఖర్ తదితరులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.

Breaking