పొద్దుగూకే టైమొచ్చింది…! మా గూటి పక్షులకు స్వాగతం పలుకుతున్నా -చింతకాని, ముదిగొండ క్యాంపు కార్యాలయ ప్రారంభోత్సవ సభల్లో మాజీ ఎంపీ పొంగులేటి
పొద్దుగూకే టైమొచ్చింది…! మా గూటి పక్షులకు స్వాగతం పలుకుతున్నా
-చింతకాని, ముదిగొండ క్యాంపు కార్యాలయ ప్రారంభోత్సవ సభల్లో మాజీ ఎంపీ పొంగులేటి
ఖమ్మం/ అక్షిత బ్యూరో :
పొద్దుగూకే టైమొచ్చింది మా గూటి పక్షులకు స్వాగతం పలుకుతున్నా.నేడో రేపో వారందరూ మా గూటికి చేరడం ఖాయమని ఖమ్మం మాజీ పార్లమెంటు సభ్యులు పొంగులేటి శ్రీనివాస రెడ్డి పేర్కొన్నారు. మధిర నియోజకవర్గంలోని చింతకాని, ముదిగొండ మండలాల్లో ఏర్పాటు చేసిన పొంగులేటి శీనన్న క్యాంపు కార్యాలయాలను ఆయన శనివారం ప్రారంభించారు. అనంతరం జరిగిన సభలను ఉద్దేశించి ఆయన మాట్లాడుతూ ప్రజలందరి దీవెనలతో ఆశీస్సులతో ఉమ్మడి ఖమ్మంజిల్లాలో పదికి పది సీట్లు గెలుస్తామని రామరాజ్యాన్ని తీసుకు వచ్చి సుపరిపాలనను అందిస్తానని ఆ రోజులు దగ్గర్లోనే ఉన్నాయని పేర్కొన్నారు. మళ్లీ మళ్లీ చెబుతున్నా ఒక్కరంటే ఒక్క బీఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థిని కూడా ఉమ్మడి ఖమ్మం జిల్లా నుంచి అసెంబ్లీ గేటు తాకనివ్వనని ప్రతినబూనరు. అన్ని పథకాల లాగానే దళితబంధు పేరుతో దళిత సోదరులను మభ్య పెట్టారని విమర్శించారు.పార్టీలకతీతంగా కార్యక్రమానికి హాజరైన వారందరికీ ప్రత్యేక ధన్యవాదలు తెలిపారు. నాలుగు సంవత్సరాలుగా అధికార పార్టీ నేతలు ఎంత హీనంగా చూశారు. శీనన్న ఏ విధంగా మిమ్మల్ని అక్కున చేర్చుకున్నాడనే విషయం ప్రజలందరికీ తెలుసుననన్నారు.శీనన్న మాటల మనిషి కాదనే విషయం ప్రతి ఒక్కరికి తెలుసని పేర్కొన్నారు. ఇచ్చిన హామీలను అమలు చేయని సీఎం కేసీఆర్ ని గద్దె దించాల్సిందేనని పేర్కొన్నారు.