ఉచిత వైద్య శిబిరాన్ని ప్రారంభించిన గుండు చందన పూర్ణచందర్
వరంగల్ ,అక్షిత బ్యూరో : వరంగల్ నగరంలోని 42వ డివిజన్ రంగశాయిపేట లోని మహిళా స్వశక్తి భవనంలో శనివారం రోజున కాకతీయ సేవా సమితి వారి ఆధ్వర్యంలో హన్మకొండ అభయ హాస్పిటల్స్ చే ఏర్పాటుచేసిన ఉచిత వైద్య శిబిరాన్ని 42 డివిజన్ కార్పొరేటర్ గుండు చందన పూర్ణచందర్ ప్రారంభించారు.
ఈ సందర్భంగా గుండు చందన మాట్లాడుతూ డివిజన్లోని ప్రతి ఒక్కరూ ఆరోగ్య విషయంలో తగిన జాగ్రత్తలు తీసుకోవాలని,అన్నారు. కార్యక్రమం లో
ఎండి డాక్టర్ గౌతమ్ డాక్టర్ వైషవి,కాకతీయ సేవా సమితి అధ్యక్షులు మండల నరసింహారాములు, రాజగోపాల్, స్థానిక పెద్దలు కరుణాకర్, రామమూర్తి, మోహనాచారి, పరమేశ్వర్, రజకాబీవృద్ది సంస్థ జిల్లా అధ్యక్షుడు వేణు, రాజు, ఆర్పీలు కవిత,రమాదేవి దేవేందర్ తిరుపతి విజయ్ సాగర్ మణిదీపిక నజీమా సతీష్ ఉమేష్, వైద్య సిబ్బంది, ప్రజలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.