మున్సిపల్ అభివృద్ధి పనులపై సమీక్ష సమావేశం

మున్సిపల్ అభివృద్ధి పనులపై సమీక్ష సమావేశం

చేర్యాల, అక్షిత ప్రతినిధి: చేర్యాల మున్సిపాలిటీ కార్యాలయంలో వివిధ పనుల పురోగతిపై శనివారం సర్వసభ్య సమావేశం ఏర్పాటు చేయగా,ఈ సమావేశంలో చైర్పర్సన్ అంకు గారి స్వరూప రాణి,వైస్ చైర్మన్ నిమ్మ రాజీవ్ రెడ్డి, కమిషనర్ రాజేంద్ర కుమార్ హాజరై మాట్లాడుతూ తెలంగాణ మున్సిపాలిటీ యాక్టు 2019 ద్వారా రూపొందించిన, తెలంగాణ మున్సిపాలిటీ (హస్మెంటు ఆప్ ప్రాపర్టీ టాక్స్ రూల్స్)20:20 ప్రకారం కనీస రేట్ ఆఫ్ టాక్స్ ను ప్రతిపాదించడం జరిగింది. అదేవిధంగా పట్టణంలో నీటి సరఫరా సమస్య ఉన్న ప్రాంతాలు మరియు వాటి నివారణ చర్యలపై, కుడి చెరువు సమీపంలో చిల్డ్రన్స్ పార్క్ ఏర్పాటు చేయుటకు, మరియు పట్టణంలో విద్యుత్ నూతన ప్రాంతాల్లో విద్యుత్ స్తంభాలు ఏర్పాటు చేయుట, మున్సిపాలిటీ అభివృద్ధిలో భాగంగా వివిధ పనులపై చర్చించడం జరిగింది.ఈ సమావేశంలో కౌన్సిలర్లు చేవిటి లింగం,ఆడెపు నరేందర్,యాట కనకవ్వ, జుబేదా కార్టూన్, ఉడుముల ఇన్నమ్మ, తుమ్మలపల్లి లీల,ముత్యాల తార, సందుల సురేష్,పచ్చిమట్ల సతీష్, కోఆప్షన్ సభ్యులు అంజనీదేవి మరియు కమిషనర్ రాజేంద్ర కుమార్, మేనేజర్ ప్రభాకర్,టిపిఓ కళ్యాణ్ చక్రవర్తి,ఏఈ శ్రీకాంత్,జె ఓ రాములు,మున్సిపాలిటీ సిబ్బంది ఉన్నారు.

Leave A Reply

Your email address will not be published.

Breaking