ముఖ్యమంత్రి కేసీఆర్ కేంద్రప్రభుత్వ పథకాలను తెలంగాణ ప్రజలకు అందకుండా చేస్తున్నారు.బుక్క

ముఖ్యమంత్రి కేసీఆర్ కేంద్రప్రభుత్వ పథకాలను తెలంగాణ ప్రజలకు అందకుండా చేస్తున్నారు.బుక్క
రాజేంద్రనగర్,అక్షిత ప్రతినిధి:
భారత ప్రధాని నరేంద్ర మోడీ కేంద్ర ప్రభుత్వ పథకాలు తెలంగాణ రాష్ట్ర ప్రజలకు అందొద్దు అనే అక్కసుతో కెసిఆర్ తన కుళ్ళుకుంతంత్ర రాజకీయ కక్షలను పేద పిల్లలపై చూపియ్యడం సిగ్గు చేటని.బిజెపి రాష్ట్ర
బుక్క వేణుగోపాల్.
ఈ సందర్భంగా బొక్క వేణుగోపాల్ మాట్లాడుతూ. తల్లితండ్రులను కోల్పోయిన పేద పిల్లలకు చేయూతనివ్వడానికి పెద్దన్న లాగా భారత ప్రధాని నరేంద్ర మోడీ “మిషన్ వాత్సల్య” ద్వారా ప్రతి నెల 4000/- రూపాయిలను అందించాలనే ఆశతో ప్రవేశపెట్టిన
పథకాన్ని రాష్ట్ర ప్రభుత్వం అంగన్వాడీ టీచర్లకు ఎలాంటి గైడ్ లైన్స్ ఇవ్వకుండా అడ్డంకులు సృష్టించడం కెసిఆర్ రాజకీయ చరిత్రలోనే ఇది అత్యంత దిక్కుమాలిన చర్యగా చెప్పుకోవచ్చు అని అన్నారు.ఇతర రాష్ట్రాలతో పాటు మన పొరుగు రాష్ట్రమైన ఆంధ్రప్రదేశ్ లో కూడా ఈ “మిషన్ వాత్సల్య” పథకాన్ని అమలుపరుస్తుంటే, ఈ పథకాన్ని మన రాష్ట్రంలో అమలు పరుచకపోవడం మన దురదుష్టకరం అని ఆవేదన వ్యక్తంచేశారు.ఈ పథక అమలుతో నరేంద్ర మోడీ తెలంగాణ రాష్ట్ర ప్రజల మదిలో పాతుకు పోతారనే ఆలోచనతో, కెసిఆర్ తెలంగాణ రాష్ట్ర పేద పిల్లల కడుపు కొట్టాలనె తన నీచ ఆలోచనను చేస్తున్నారని తీవ్రంగా ఖండించారు.ఇలాంటి ఎన్నో కేంద్ర ప్రభుత్వ పథకాలను కెసిఆర్ తన కుళ్ళు రాజకీయాల్లో భాగంగా తెలంగాణ రాష్ట్ర ప్రజలకు అందనివ్వకుండా తెలంగాణ ప్రజలను నష్టపరుస్తున్నాడని బుక్క వేణుగోపాల్ మండిపడ్డారు.తెలంగాణ ప్రజలు కెసిఆర్ పాలనతో విస్తుపోయారని, తెలంగాణ రాష్ట్ర ప్రజలకు ప్రపంచ నాయకుల్లో అగ్రనాయకుడిగా ఎదిగిన నరేంద్ర మోడీ భారతీయ జనతా పార్టీనే శ్రీరామ రక్షా అని తెలియజేశారు.

Leave A Reply

Your email address will not be published.

Breaking