ఘనంగా స్వాతంత్ర సమరయోధులు దొడ్డి కొమురయ్య వర్ధంతి వేడుకలు _దొడ్డి కొమురయ్య ఆశయాలను నెరవేరుద్దాం _దొడ్డి కొమురయ్య సేవా సమితి చైర్మన్ దొడ్డి నరహరి
ఘనంగా స్వాతంత్ర సమరయోధులు దొడ్డి కొమురయ్య వర్ధంతి వేడుకలు
_దొడ్డి కొమురయ్య ఆశయాలను నెరవేరుద్దాం
_దొడ్డి కొమురయ్య సేవా సమితి చైర్మన్ దొడ్డి నరహరి
చేర్యాల,ఏప్రిల్ 15 అక్షిత ప్రతినిధి:
స్వాతంత్ర సమరయోధులు దొడ్డి కొమురయ్య వర్ధంతి సందర్భంగా, శనివారం చేర్యాల పట్టణంలో దొడ్డి కొమురయ్య సేవా సమితి చైర్మన్ దొడ్డి నరహరి ఆధ్వర్యంలో దొడ్డి కొమరయ్య శిలా పలకానికి పూల మాలలు వేసి ఘాన నివాళ్ళు అర్పించారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రతి సంవత్సరం ఏప్రిల్ 15న తన తండ్రి జ్ఞాపకార్థం అన్నదానాలు, పేద విద్యార్థులకు నోట్ బుక్స్ పంపిణీ తదితర ఎన్నో సామాజిక సేవా కార్యక్రమాల్లో పాలుపంచుకుంటూ తన వంతు సహాయ సహకారాలు అందజేస్తున్నానని తెలిపారు. ఆజాద్ హింద్ పౌజ్ వ్యవస్థాపకులు నేతాజీ సుభాష్ చంద్రబోస్ తో కలసి భారత స్వతంత్ర పోరాటంలో తన తండ్రి దొడ్డి కొమురయ్య ప్రాణాలకు తెగించి పోరాటం చేశారని గుర్తు చేశారు.ఆరోజుల్లో బుల్లెట్ రైఫిల్ దెబ్బలు మరియు జైలు జీవితం కూడా గడిపారని తెలిపారు. అతనిపై అరెస్ట్ వారెంట్ ఇష్యూ చేయడంతో బొంబాయికి చేరుకొని నేతాజీ సుభాష్ చంద్రబోస్ బృందంలో చేరి అనేక పోరాటాలు చేశారన్నారు.1972 లో చేర్యాల పట్టణంలో దొడ్డి కొమురయ్య పేరుతో ఏర్పాటు చేసిన శిలా ఫలకం అప్పటి ప్రధాన మంత్రి ఇందిరా గాంధీ ఆవిష్కరించి, దీనితో పాటు ‘తామ్ర పత్రం’ బహూకరించి గాంధీ భవన్ లో ఘనంగా సన్మానించారని తెలిపారు.చివరి వరకు ప్రజలకు ఉచితంగా వైద్య సేవలు అందిస్తూ సికింద్రాబాద్ మల్కాజ్గిరిలో 2001లో తుది శ్వాస విడిచారని అన్నారు.అనంతరం అన్నదాన కార్యక్రమం నిర్వహించారు.ఈ కార్యక్రమంలో దొడ్డి గోపీకృష్ణ,దొడ్డి ప్రేమ్‌కుమార్,దొడ్డి శ్రీనివాస్,దొడ్డి దినేష్,కె.ఏడుకొండలు,సురేందర్ బెనర్జీ,న్యాయవాది కె.సురేష్, అరికంటి శ్రీనివాస్,సుద్దాల పద్మ, ఆవుల ఇందిర,సాయి కుమారి తదితరులు పాల్గొన్నారు.