పూడూరు లో ఎమ్ ఆర్ పి ఎస్ జెండా ఆవిష్కరణ..

పూడూరు లో ఎమ్ ఆర్ పి ఎస్ జెండా ఆవిష్కరణ..

మేడ్చల్, అక్షిత బ్యూరో : మేడ్చల్ నియోజకవర్గం లో పూడూరు గ్రామంలో నూతనంగా ఏర్పాటు చేసిన కమిటీ మండల అధ్యక్షుడు పరుశురాం మాదిగ, జాతీయ కళామండలి అధ్యక్షుడు ఎన్ వై అశోక్ మాదిగ ఆధ్వర్యంలో జెండా ఆవిష్కరణ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎమ్మార్పీఎస్ అధ్యక్షుడు మందకృష్ణ ఆదేశాలతో మండలంలోని ప్రతి గ్రామంలో కమిటీలు ఏర్పాటు చేయడం జరుగుతుందని తెలిపారు. గ్రామస్థాయి నుండి ఉద్యమాన్ని మరింత బలోపేతం చేయడానికి ప్రతి ఒక్క కార్యకర్త సన్నద్ధం కావాలని పిలుపునిచ్చారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలపై ఒత్తిడి తీసుకువచ్చి ఎస్సీ వర్గీకరణను సాధించే దిశగా అడుగులు వేయాలని కార్యకర్తలకు సూచించారు. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ బాబు యాదవ్, ఎమ్మార్పీఎస్ అధ్యక్షుడు బక్క నాగరాజు, నాయకులు మానేపల్లి వెంకటేష్, గడ్డం బాబు, గడ్డం నాగరాజ్ భాస్కర్, మధు సుధన్, ఏళ్ళమేశ్వర్, అశోక్, కిరణ్, నాయకులు బాల నరసింహ, నరేందర్, శ్రీనివాస్, సునీల్ శివ కుమార్ రామకృష్ణ ప్రభాకర్ నవీన్, నరసింహ, శ్యామ్ వై నర్సింగ్ రావు తదితరులు పాల్గొన్నారు….

Leave A Reply

Your email address will not be published.

Breaking