యాదవ సంఘం సిటీ కార్యదర్శి గా ఐలయ్య యాదవ్
వరంగల్,అక్షిత బ్యూరో: వరంగల్ జిల్లా యాదవ సంఘం సిటీ కార్యదర్శిగా బసరబోయిన ఐలయ్య యాదవ్ ను నియమించినట్టు ఆ సంఘం రాష్ట్ర కమిటీ బాధ్యుడు బాబు యాదవ్ తెలియజేనాడు. ఈ సందర్భంగా శనివారం వరంగల్ నగరంలో నియామక పత్రాన్ని అందజేశారు. తనపై నమ్మకంతో ఈ పదవి ఇచ్చినందుకు రాష్ట్ర కమిటీకి జిల్లా కమిటీకి కృతజ్ఞతలు తెలియజేస్తూ యాదవులు ఎదురు ఉన్న వివిధ సమస్యలపై పోరాడి న్యాయం చేసేందుకు సహకరిస్తానని అన్నారు యాదవ సొసైటీలకు ఉచిత గొర్రెల పథకం ప్రతి సభ్యునికి అమలు చేయాలని దాని కోసం కృషి చేస్తానని ఐలయ్య అన్నాడు