ప్రజల దాహార్తిని తీర్చేందుకు చలివేంద్రాలు ఏర్పాటు అభినందనీయం… మాధవరం కాంతారావు.
కూకట్ పల్లి, అక్షిత ప్రతినిధి: వేసవిలో ప్రజల దాహార్తిని తీర్చేందుకు చలివేంద్రాలు ఎంతో ఉపయోగపడతాయని కూకట్ పల్లి నియోజకవర్గ భారతీయ జనతా పార్టీ ఇన్చార్జి మాధవరం కాంతారావు అన్నారు. నియోజకవర్గ పరిధలోని బాలానగర్ డివిజన్ అధ్యక్షులు జి.ఆర్.రమేష్ అధ్యక్షతన స్వచ్ భారత్ అభియాన్ ఫౌండర్ అండ్ చైర్మన్ మాధవరం కాంతారావు ఆధ్వర్యంలో చలివేంద్రం ఏర్పాటు చేశారు. చలివేంద్రాన్ని మాధవరం కాంతారావుతోపాటు, కూకట్ పల్లి భారతీయ జనతా పార్టీ సీనియర్ నాయకులు వడ్డేపల్లి రాజేశ్వరరావు తో కలిసి ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో బాలా నగర్ డివిజన్ కంటెస్టెడ్ కార్పొరేటర్ వై నర్సిరెడ్డి, మాజీ కార్యదర్శి సురేందర్ రెడ్డి , ప్రధాన కార్యదర్శి లక్ష్మణ్ , పప్పు పటేల్, సంతోష్, పద్మారావు, కాళిదాస్, ఎస్సీ మూర్ఛ అధ్యక్షులు అనిల్ కుమార్, మహిళా మోర్చా అధ్యక్షురాలు శివరంజని, గణేష్ , జి శ్రీనివాస్ , సంధ్య, రజిత , వాణిశ్రీ నాయుడు , సుజాత , విజయ సంతోష్ తదితరులు పాల్గొన్నారు.