అంబేద్కర్ స్ఫూర్తి దేశానికి ఆదర్శం… బిజెపి నాయకులు వడ్డేపల్లి రాజేశ్వరరావు.
కూకట్ పల్లి, అక్షిత ప్రతినిధి:
డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ స్ఫూర్తి దేశానికి ఆదర్శమని కూకట్ పల్లి నియోజకవర్గం భారతీయ జనతా పార్టీ సీనియర్ నాయకులు వడ్డేపల్లి రాజేశ్వరరావు అన్నారు. రాజ్యాంగ నిర్మాత, బాబా సాహెబ్ డాక్టర్ బీ ఆర్ అంబేద్కర్ జయంతి సందర్బంగా మూసాపేట్ అంబేద్కర్ నగర్ లో భారీ శోభయాత్ర నిర్వహించారు. కర్క నిఖిల్ ఆహ్వానం మేరకు ఈ శోభయాత్రలో ముఖ్య అతిథిగా వడ్డేపల్లి రాజేశ్వరరావు పాల్గొన్నారు.
ఈ సందర్బంగా అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు . అనంతరం వడ్డేపల్లి రాజేశ్వరరావు మాట్లాడుతూ అంబేద్కర్ ఆశయ సాధనకు యువత కృషి చేయాలని అన్నారు . దేశం ఏ రకంగా ముందుకు పోవాలో చూపిస్తూ వివిధ విధానాలు రాసిన మహానుభావుడు భారతరత్న డాక్టర్ బిఅర్ అంబేద్కర్ అని అన్నారు. ఈ కార్యక్రమంలో కర్కా డాకయ్య, శేఖర్ గుప్తా, ఈ. సాయి ప్రసాద్, స్వరూప, అనంత నాగరాజు తదితరులు పాల్గొన్నారు.