వెలుగు కార్యక్రమాన్ని విజయవంతం చేయాలి ఎంపీపీ కన్నెబోయిన జ్యోతి బలరాం

వెలుగు కార్యక్రమాన్ని విజయవంతం చేయాలి
ఎంపీపీ కన్నెబోయిన జ్యోతి బలరాం

నకిరేకల్ అక్షిత ప్రతినిధి:

కంటి వెలుగు కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని ఎంపీపీ కన్నెబోయిన జ్యోతి బలరాం, సర్పంచ్ పిట్ట కృష్ణారెడ్డి అన్నారు. శనివారం మండలంలోని కక్కిరేణి గ్రామంలో ఎంపీపీ, సర్పంచ్ వైద్య సిబ్బందితో కలిసి కంటి వెలుగు ఆహ్వాన పత్రికలను గ్రామ ప్రజలకు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ అందత్వ నివారణే లక్ష్యంగా తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన కంటి వెలుగు కార్యక్రమాన్ని ప్రతి ఒక్కరు సద్వినియోగం చేసుకొని కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరారు.కక్కిరేణిలో 17- 04 – 2023 నుండి 28 – 4 – 2023 వరకు నిర్వహించే కంటి వెలుగు శిబిరాన్ని 18 సంవత్సరాలు పైబడిన ప్రతి ఒక్కరు కంటి పరీక్షలు చేయించుకొని ప్రభుత్వం అందించే మందులు, అద్దాలను ఉచితంగా పొందాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ఏఎన్ఎం కేతమ్మ వార్డు మెంబర్ వేముల సైదులు, ఆశా కార్యకర్తలు కవిత, సూర్యకళ తదితరులు పాల్గొన్నారు

Leave A Reply

Your email address will not be published.

Breaking