అభివృద్ధికి ఆమడ దూరంలో తుంగతుర్తి
బిఎస్పి నియోజకవర్గ నాయకులు కొండగడుపుల నవీన్
తుంగతుర్తి అక్షిత:
తుంగతుర్తి మండల కేంద్రంలో ఒక నియంత పాలన కొనసాగుతుందని బహుజన సమాజ్ పార్టీ నియోజకవర్గ నాయకులు కొండగడుపుల నవీన్ అన్నారు.దానికి నిదర్శనమే ఈ డ్రైనేజీ కాలువల దుస్థితి అదే విధంగా గత మూడు రోజులుగా 6, 9,10 మరికొన్ని వార్డులలో తాగునీటి సరఫరా కాకపోవడం
గ్రామపంచాయతీ నిధులన్నీ ఏం చేస్తున్నారని ప్రశ్నించారు? కనీసం దోమల మందు, బ్లీచింగ్ పౌడర్ వేయకుండా గ్రామపంచాయతీ సర్పంచ్, కార్యదర్శి వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు. తుంగతుర్తిలో 14 వార్డులలో 75% వీధిలైట్లు లేకపోవడం స్థానిక నాయకులమని చెప్పుకునే వారికి సిగ్గుచేటు,గత 20రోజుల క్రింద అంగడి వేలంలో 6లక్షల 40 వేల రూపాయిల నిధులు వచ్చాయి అయినాను అంగడి ప్రదేశంలో కనీస మౌలిక సదుపాయాలు చేయలేదు . చుట్టుపక్కల నుండి చిరు వ్యాపారులు మహిళలు, వృద్ధులు అధిక సంఖ్యలో రావడం జరుగుతుంది వారికి కనీసం మంచినీటి సౌకర్యం, టాయిలెట్స్ సౌకర్యం లేదు
స్థానిక నాయకులకు గ్రామ అభివృద్ధి కన్నా
సర్పంచి మెప్పు ముఖ్యం.అని అన్నారు వీధిలైట్లు లేకపోవడం వల్ల పాములు, కుక్కల బెడద ఎక్కువ అయింది .ఈ నాలుగు రోజుల వ్యవధిలో డ్రైనేజీ కాలువల పూడికతీత, మంచినీటి సరఫరా సమస్య, ముఖ్యంగా వీధిలైట్లు సమస్యలు తీర్చని యెడల బహుజన సమాజ్ పార్టీ ప్రజల తరఫున జిల్లా కలెక్టర్ దగ్గరికి వెళ్తామని హెచ్చరించారు. బిజెపి మరియు టిఆర్ఎస్ నాయకులు కలసి బిల్లులు చూపించి నిధుల పంపకంలో మునిగిపోయారని ఎద్దేవా చేశారు.
ఈ కార్యక్రమంలో బంగారు మనోజ్, బొంకూరి బాలకృష్ణ, కొండగడుపుల మధుసూదన్, కొండగడుపుల నాగరాజ్ ,బొంకూరి శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.