ఐకెపి ధాన్యాన్ని వెంటనే
దిగుమతి చేసుకోవాలి
*మిల్లర్స్ సమావేశంలో
డిఎస్ఓ వెంకటేశ్వర్లు
మిర్యాలగూడ, అక్షిత ప్రతినిధి :
ఐకెపి నుంచి వచ్చిన ధాన్యాన్ని మిల్లర్లు తక్షణమే దిగుమతి చేసుకోవాలని డీఎస్ఓ వెంకటేశ్వర్లు సివిల్ సప్లై డిఎం నాగేశ్వరరావు ఆదేశించారు శనివారం సాయంత్రం స్థానిక మిల్లర్స్ అసోసియేషన్ భవనంలో సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సీఎంఆర్ కింద ఉన్న రైస్ మిల్లులో ఐకెపి ధాన్యాన్ని దిగుమతి చేసుకోవాలన్నారు. 60 రైస్ మిల్లులు వెంటనే ధాన్యాన్ని దిగుమతి చేసుకొని ట్యాగింగ్ ఇవ్వాలి అన్నారు. ధాన్యం దిగుమతి చేసుకున్న వెంటనే రసీదు ఇవ్వాలన్నారు. మిర్యాలగూడ పరిసర ప్రాంతాలలో సిఎంఆర్ కింద నూతనంగా గుర్తించిన 14 రైస్ మిల్లులను పరిశీలించారు. ఈ మిల్లులో కూడా ఐకెపి ధాన్యాన్ని దిగుమతి చేసుకోవాలన్నారు. కార్యక్రమంలో ఇండస్ట్రియల్ ఏడి గణేష్ పొల్యూషన్ అధికారి పురుషోత్తం రెడ్డి సివిల్ సప్లై డిటి రామకృష్ణ రెడ్డి ఆర్ఐ సురేందర్ సింగ్ మిల్లర్స్ అసోసియేషన్ అధ్యక్షులు గౌరు శ్రీనివాస్ రాష్ట్ర ఉపాధ్యక్షులు కర్నాటి రమేష్ బండారు కుశలయ్య మిల్లర్లు అధికారులు పాల్గొన్నారు.