పట్టణ ప్రాంతాలకు కూలీలు వలస వెళ్లకుండా ఉపాధి పనులు
మిర్యాలగూడ, అక్షిత ప్రతినిధి :
గ్రామీణులు ఉపాధికి పట్టణాలకు వలస వెళ్లకుండా చేయడానికే మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి పథకమని స్థానిక ఎంపిడిఓ జ్యోతిలక్ష్మి అన్నారు. గ్రామీణ కూలీలను చైతన్య పర్చే కార్యక్రమంలో భాగంగా శనివారం రాత్రి మిర్యాలగూడ మండలంలోని వెంకటాద్రిపాలెం గ్రామపంచాయతీలో కూలీలతో మాట్లాడుతూ గ్రామంలోనే ఉండి పనులు చేసుకుని కూలీ గిట్టుబాటుకై ప్రభుత్వం పథకాన్ని ప్రవేశ పెట్టిందని సద్వినియోగం చేసుకోవాలని పట్టణాలకు ఇబ్బందులు పడవద్దని కోరారు. ఆమె వెంట పంచాయతి కార్యదర్శి యాదగిరి, ఉపాధి ఫీల్డ్ అసిస్టెంట్లున్నారు.