మతోన్మాద కార్పొరేట్ బిజెపిని గద్దెదించండి సీపీఐ జాతీయ కార్యవర్గ సభ్యులు సభ్యులు చాడా వెంకట్ రెడ్డి

మతోన్మాద కార్పొరేట్ బిజెపిని గద్దెదించండి

సీపీఐ జాతీయ కార్యవర్గ సభ్యులు సభ్యులు

చాడా వెంకట్ రెడ్డి

మద్దూరు అక్షిత న్యూస్:

మతోన్మాద కార్పొరేట్ అనుకూల బిజెపి ప్రభుత్వాన్ని గద్దెదించి దేశాన్ని రక్షించుకోవాలని సిపిఐ జాతీయ కార్యవర్గ సభ్యులు సమితి సభ్యులు చాడా వెంకట్ రెడ్డి పిలునిచ్చారు.
మంగళ వారం సలాఖ్ పూర్, రేబర్తి, గాగిల్లాపూర్ గ్రామాలలో ప్రచారం నిర్వహించారు.ఈ సందర్భంగా సిపిఐ జాతీయ కార్యవర్గ సభ్యులు చాడా వెంకట్ రెడ్డి మాట్లాడుతూ కేంద్రంలో బిజెపి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 9 సంవత్సరాలు గడుస్తున్నా రాష్ట్ర విభజన హామీలు అమలు చేయడంలో పూర్తిగా విఫలమయ్యారని విమర్శించారు. బయ్యారం ఉక్కు పరిశ్రమ, కాజీపేట రైల్వే కోచ్ ఫ్యాక్టరీ లను నెలకొల్పకుండా తెలంగాణకు తీవ్ర అన్యాయం చేసిందన్నారు. ప్రవేటీకరణ పేరుతో ప్రభుత్వ రంగ సంస్థలను అదాని, అంబానీ లాంటి బడా పెట్టుబడిదారులకు దారాదత్తం చేసి అప్పనంగా అమ్మేస్తుందని మండిపడ్డారు.పెట్రోల్, డీజిల్ వంట,గ్యాస్,నిత్యవసర సరుకుల ధరలు విపరీతంగా పెంచి సామాన్యుల నడ్డీ విరుస్తుందన్నారు. రాష్ట్రంలో కేసీఆర్ ఎన్నికల ముందు ప్రజలకు హామీ ఇచ్చిన రైతు రుణమాఫీ, డబల్ బెడ్ రూమ్ ఇండ్లు,అర్హులైన పేదలందరికీ పెన్షన్లు, నిరుద్యోగ భృతి, ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించడంలో విఫలమయ్యారన్నారు.ఈ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల విధానాలను ఎండగడుతూ ఇంటింటికి సిపిఐ పల్లె పల్లెకుకు సిపిఐ కార్యక్రమం నిర్వహించారు.ఈ కార్యక్రమంలో సీపీఐ రాష్ట్ర నాయకులు గడిపే మల్లేష్, జిల్లా కార్యవర్గ సభ్యులు అందె అశోక్, సిపిఐ మండల నాయకులు ఉడుగుల శ్రీనివాస్, సకినాల బాలరాజ్, ఇమ్మడి కిష్టయ్య, బియ్య రాజు, గోరుకంటి కుమార్, చెట్కూరి యాదయ్య, దయ్యాల కనకయ్య, మర్మముల బుచ్చయ్య తదితరులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.

Breaking