దళిత రత్న అవార్డు అందుకున్న దుడ్డు పోచయ్య.
రాజేంద్రనగర్ అక్షిత ప్రతినిధి:రాజేంద్రనగర్ ప్రాంతానికి చెందిన దళిత నాయకుడు సామాజిక కర్త దుడ్డు పొచెయ్యకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం డాక్టర్ బీఆర్ అంబెడ్కర్ జయంతి వేడుకల సందర్భంగా ఇచ్చే ప్రతిష్టాత్మకమైన దళిత రత్న అవార్డును అందజేశారు.రవీంద్రభారతిలో జరిచిన డాక్టర్ బీఆర్ అంబెడ్కర్ జయంతి వేడుకల సందర్బంగా ఆయనకు అధికారులు రాహుల్ భోజ్జా డాక్టర్ హోజితరణ చేతుల మీదుగా దుడ్డు పోచయ్య ఈ అవార్డును అందుకున్నారు.కార్యక్రమంలో దళిత నాయకులు మేడి పాపయ్య, నరేందర్, గుంటి సురేష్, రావుల విజయ్ కుమార్,పాల్గొన్నారు. సందర్భంగా దుడ్డు పోచయ్య మాట్లాడుతూ దళిత వర్గాలకు చేసిన సేవలను గుర్తించి తనకు ఈ అవార్డు ఇవ్వడం ఎంతో సంతోషాన్నిచ్చింద ని ముఖ్యంగా తనలో మరింత స్ఫూర్తిని నింపిందని ఆయన హర్షం వ్యక్తం చేశారు.