మానవులు జంతువుల ఆరోగ్యాన్ని పర్యావరణంతో అనుసంధానించాలి

మానవులు జంతువుల ఆరోగ్యాన్ని పర్యావరణంతో అనుసంధానించాలి
రాజేంద్రనగర్, అక్షిత ప్రతినిధి:
ఆదివారం హైదరాబాద్ రాజేంద్రనగర్ లో
పశువైద్య విశ్వ విద్యాలయ 4 వ స్నాతకోత్సవం కార్యక్రమం వ్యవసాయ విశ్వవిద్యాలయ ఆడిటోరియంలో జరిగింది. మానవులు, జంతువులు పర్యావరణం యొక్క ఆరోగ్యం ఒక దానితో ఒకటి అనుసంధానించబడిందని ఈ వన్ హెల్త్ కాన్సెప్ట్ ని అభివృద్ధి చేయడంలో పశు వైద్యులు కీలక పాత్ర పోషించాలని తెలంగాణ రాష్ట్ర గవర్నర్ పి.వి నరసింహారావు తెలంగాణ పశువైద్య విశ్వవిద్యాలయ ఛాన్సలర్ డా. తమిళసై సౌందరరాజన్ పిలుపునిచ్చారు.విశ్వ విద్యాలయ 4 వ స్నాతకోత్సవంలో గవర్నర్ వర్చ్యువల్ పద్దతిలో పాల్గొని ప్రసంగించారు. ఈ స్నాతకోత్సవ కార్యక్రమంలో రాజస్థాన్ యూనివర్సిటీ ఆఫ్ వెటర్నరీ అండ్ యానిమల్ సైన్సెస్ ఉపకులపతి ప్రొ. సతీష్ కుమార్ గార్గ్ ముఖ్య అతిధిగా హాజరై స్నాతకోత్సవ ఉపన్యాసం ప్రసంగిస్తూ విద్యార్థులు పాడి పశువుల రంగంలో అంకుర సంస్థలు మొదలు పెట్టడం ద్వారా ఉద్యోగ అవకాశాలు కల్పించే స్థాయికి చేరుకోవచ్చునని పిలుపునిచ్చారు.

పాడి పశువుల్లో సెక్స్ క్రమబద్దీకరించిన వీర్య సాంకేతికత, క్లోనింగ్, జన్యు మార్పిడి, కృతిమ గర్భధారణ వంటి నూతన సాంకేతికత పద్దతులను రైతులు పెద్ద ఎత్తున పాటించాలని కోరారు. ఉపకులపతి డా వి. రవీందర్ రెడ్డి విశ్వవిద్యాలయ ప్రగతిని వివరించారు. అనంతరం విశ్వ విద్యాలయంలో వివిధ రంగాల్లో అద్భుత ప్రతిభ కనబర్చిన ముగ్గురు ఉపాధ్యాయులు విద్యార్థినులకు బంగారు పథకాలు అందజేశారు. అదేవిధంగా మొత్తం 239 విద్యార్థులకు ఈ స్నాతకోత్సవంలో పట్టాలను అందజేశారు.
ఉత్తమ ఉపాధ్యాయ అవార్డు అందుకున్న అసోసియేట్ ప్రొఫెసర్ డా. అశోక్.
అలాగే బంగారు పతకాలు అందుకున్న అసిస్టెంట్ ప్రొఫెసర్ డా. కల్యాణి,
4 బంగారు పతకాలను అందుకున్న జక్కిడి.ప్రణతి, రావుల తులసి, రియా బాచ్ పై, కె. దివ్య, అన్నపురెడ్డి ప్రవళిక, గుండు బిందు స్రవంతి, గజ్జల మహేశ్వరి ఈ కార్యక్రమంలో రిజిస్ట్రార్ డా. విరోజి రావు, పాలక మండలి, అకాడమిక్ కౌన్సిల్ సభ్యులతో పాటు విద్యార్థులు, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.

Breaking