రామంజపూర్ గ్రామంలో హత్ సే హత్ జోడోయాత్ర.పాల్గొన్న జ్ఞానేశ్వర్ ముదిరాజ్
రాజేంద్రనగర్ పద్మక్రాంతి ప్రతినిధి:
రాజేంద్రనగర్ నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీని భారీ మెజారిటీతో గెలిపించాలని పీసీసీ ప్రధాన కార్యదర్శి జ్ఞానేశ్వర్ ముదిరాజ్ అన్నారు, శంషాబాద్ మండలం రామంజపూర్ గ్రామంలో ఆదివారం హత్ సే హత్ జోడోయాత్ర కార్యక్రమం ప్రారభించారు. ఈసందర్బంగా గ్రామంలో జెండాను ఆవిష్కరించారు. ఈసందర్బంగా హత్ సే హత్ జోడోయాత్ర ప్రాముఖ్యతను ప్రజలకు వివరించారు.ప్రజలు కోరుకున్న సుపరిపాలన కాంగ్రెస్ పార్టీతోనే సాధ్యమని పేర్కొన్నారు.కాంగ్రెస్ ప్యాభుత్వం కేంద్రంలో రాష్ట్రంలో అధికారంలో ఉన్నప్పుడే ప్రజలు సుఖసంతోషాలతో ఉన్నారని తెలిపారు.2024 ఎన్నికల్లో ప్రజలు కాంగ్రెస్ పార్టీకి ఓటువేసి గెలిపించాలని రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చినప్పుడే మహానేత వైఎస్సార్ పరిపాలించిన సుపరిపాలన అమలవుతుందని అన్నారు.ఈకార్యక్రమంలో ఈకార్యక్రమంలో రాష్ట్ర ఎస్సీ సెల్ ఉపాధ్యక్షుడు జల్ పల్లి నరేందర్ శంషాబాద్ మున్సిపల్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు మరియు కౌన్సిలర్ పిల్లనగ్రోవిల సంజయ్ యాదవ్ శంషాబాద్ మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు గడ్డం శేఖర్ యాదవ్, శ్రీనివాస్ గౌడ్ శేఖర్ గుప్తా, ప్రవీణ్ యాదవ్, యాదయ్య, రాజు, ధనుంజయ, ఖలీద్, తాజుద్దీన్, పరమేష్, చందు యాదవ్, రాకేష్, పాండు యాదవ్, శ్రీకాంత్ తదితరులు పాల్గొన్నారు.