కెసిఆర్ ను హ్యాట్రిక్ ముఖ్యమంత్రిగా గెలిపించేందుకు ప్రతి ఒక్కరూ కష్టపడి పని చేయాలి.ఎల్.రమణ

కెసిఆర్ ను హ్యాట్రిక్ ముఖ్యమంత్రిగా గెలిపించేందుకు ప్రతి ఒక్కరూ కష్టపడి పని చేయాలి.ఎల్.రమణ
రాజేంద్రనగర్, అక్షిత ప్రతినిధి: హ్యాట్రిక్ ముఖ్యమంత్రిగా ముఖ్యమంత్రి కేసీఆర్ ముచ్చటగా మూడోసారి అధికారంలోకి రావడం పద్యం అని రంగారెడ్డి జిల్లా బిఆర్ఎస్ పార్టీ ఇన్చార్జ్ ఎల్ రమణ పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలన్నీ ప్రజలకు తెలియజేసేందుకు ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశాల మేరకు నిర్వహిస్తున్న పార్టీ ఆత్మీయ సమ్మేళన కార్యక్రమాలు పార్టీ నేతలు కార్యకర్తల్లో నూతనుద్దేశాన్ని నింపుతుందని రమణ అన్నారు.రాజేంద్రనగర్ నియోజకవర్గం పరిధిలో భాగమైన శంషాబాద్ మున్సిపల్ పరిధిలోని వైఎన్ఆర్ గార్డెన్స్ లో బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో ఆత్మీయ సమ్మేళనం కార్యక్రమాన్ని నిర్వహించారు.అంతకు ముందు మున్సిపల్ పరిధిలోని 25వార్డుల కౌన్సిలర్లు స్థానిక కార్యకర్తలతో ప్రతి వార్డునుంచి బైక్ ర్యాలీలు నిర్వహిస్తూ వైఎన్ఆర్ గార్డెన్స్ కు భారిసంఖ్యలో తరలివచ్చారు.ఈకార్యక్రమానికి ముఖ్యాఆతిధులుగా ఎల్.రమణ,ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్ లు పాల్గొన్నారు.ఎల్.రమణ మాట్లాడుతూ…ఒకప్పుడు అభివృద్ధికి ఆమడదురంలో ఉన్న శంషాబాద్ ఇప్పుడు అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు సాధించిందని అన్నారు.మున్సిపల్ కనీవినీ ఎరుగని రీతిలో అభివృద్ధిలో సాగిపోతుందని ఆయన అన్నారు.

ప్రకాష్ గౌడ్ హ్యాట్రిక్ ఎమ్మెల్యే గా విజయం సాధించినట్లు గానే ముఖ్యమంత్రి కేసీఆర్ ను కూడా హ్యాట్రిక్ సిఎం చేసేందుకు పార్టీ నేతలు,కార్యకర్తలు యుద్ధ సన్నద్ధులై కంకణ బద్ధులై ఉండాలని పిలుపునిచ్చారు.ముక్యంగా ప్రజల పాలిట శాపంగా మారిన 111జీవోను తొలగిస్తామని ముఖ్యమంత్రి అసెంబ్లీ సాక్షిగా క్యాబినెట్ తీర్మానం చేసారని గుర్తుచేశారు.ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్ మాట్లాడుతూ…. పోరాడు తెచ్చుకున్న తెలంగాణ రాష్ట్రంలో ముఖ్యమంత్రి కేసీఆర్ నేతృత్వంలో రాష్ట్రం కనివిని రీతిలో అభివృద్ధి లో పరుగులు పెడుతుందన్నారు. దేశంలో ఎక్కడా లేని సంక్షేమ పథకాలను తెలంగాణ రాష్ట్రంలో అమలు చేస్తున్న ఘనత ముఖ్యమంత్రి కేసీఆర్ కే చెందుతుందన్నారు. టిఆర్ఎస్ కాస్త టీఆర్ఎస్ పార్టీగా రూపాంతరం చెందిందని దేశానికే తెలంగాణ ఆదర్శమైతే నేషనల్ పార్టీగా అవతరించిన టిఆర్ఎస్ పార్టీ దేశంలోని అన్ని రాష్ట్రాల్లో కూడా ఇదే మాదిరిగా సంక్షేమ పథకాల అమలు చేస్తుందని ఆయన అన్నారు. కొంతమంది ఓటు బ్యాంకుల కోసం కులాలను మతాలను అడ్డం పెట్టుకొని రాజకీయాలు చేస్తున్నారని ఆయనప్పటికీ ప్రజలు మాత్రం కేసీఆర్నే విశ్వసిస్తున్నారని అన్నారు. ఎన్నికలు ఎప్పుడు వచ్చినా ముఖ్యమంత్రి కేసీఆర్ హ్యాట్రిక్ సీఎంగా విజయం సాధించడం తద్యమని ఆయన ఆశాభావాన్ని వ్యక్తం చేశారు. రాజేంద్రనగర్ లో అత్యధికంగా మహిళా ఓటర్లే అధికంగా ఉన్నారని వారి సంపూర్ణ మద్దతుతో రాజేంద్రనగర్లో బిఆర్ఎస్ పార్టీ మరోసారి జెండాను ఎగరవేయడం తద్దిమని ఆయన ధీమా వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా మున్సిపల్ చైర్మన్ కొలన్, సుష్మా మహేందర్ రెడ్డి, వైస్ చైర్మన్ బండి గోపాల్ యాదవ్, జడ్పిటిసి నీరట తన్వి రాజు ముదిరాజ్ లు మాట్లాడుతూ….అన్న అంటే నెనున్నానని పలికే ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్ నాలుగోసారి ఎమ్మెల్యేగా గెలుపొందడం తద్దిమని ధీమాను వ్యక్తం చేశారు. గతము కంటే ఈ ఎన్నికల్లో లక్ష మెజారిటీతో ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్ ఎమ్మెల్యే గెలుపొందడం తద్యమని అన్నారు. ఈ కార్యక్రమంలో మండల పార్టీ అధ్యక్షుడు కే చంద్రారెడ్డి, ప్రధాన కార్యదర్శి ముంచర్ల మోహన్ రావు,
నార్సింగ్ మార్కెట్ కమిటీ చైర్మన్ దూడల వెంకటేష్ గౌడ్, సీనియర్ నాయకులు గణేష్ గుప్తా,దీప మల్లేష్, శంషాబాద్ మండల్ జడ్పీటీసీ నీరటిరాజు ముదిరాజ్, మండల్ పార్టీ మున్సిపల్ కౌన్సిలర్లు,ఆయిల్ కుమార్,అజయ్,మేకల వెంకటేష్ ముదిరాజ్, జహంగీర్ ఖాన్,అమృత సుధాకర్ రెడ్డి,స్రవంతి శ్రీకాంత్ రెడ్డి,కె.భారతమ్మ,రేఖ, కో ఆప్షన్ కవిత ప్రసాద్,మెంబర్లు,రచమల్ల దాసు,రాజేందర్,వెంకట్ రెడ్డి,బుగ్గయ్య, బి.ఆర్.ఎస్ వార్డు అధ్యక్షులు, మున్సిపల్ ప్రధాన కార్యదర్శి హనుమంత్ ముదిరాజ్,రచమల్ల సురేష్,సర్పంచులు,వార్డు మెంబర్లు,ఎంపిటిసిలు, మండల్ సీనియర్ నాయకులు, మరియు యువనాయకులు, కార్యకర్తలు, తదితరులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.

Breaking