రోజుకు 2.3 లక్షల టన్నుల బొగ్గు ఉత్పత్తి 2.35 లక్షల టన్నుల బొగ్గు రవాణా జరపాలి * అన్ని ఏరియాలో జనరల్ మేనేజర్ లకు డైరెక్టర్ల ఆదేశం

రోజుకు 2.3 లక్షల టన్నుల బొగ్గు ఉత్పత్తి
2.35 లక్షల టన్నుల బొగ్గు రవాణా జరపాలి

* అన్ని ఏరియాలో జనరల్ మేనేజర్ లకు డైరెక్టర్ల ఆదేశం

భద్రాద్రి కొత్తగూడెం అక్షిత ప్రతినిధి;

ఎండాకాలంలో విద్యుత్ వినియోగం పెరిగి విద్యుత్ సంస్థల నుండి బొగ్గుకు డిమాండ్
పెరుగుతున్న నేపథ్యంలో సింగరేణి వ్యాప్తంగా అన్ని ఏరియాలో కలిపి రోజుకు కనీసం రెండు
లక్షల ముప్ఫై వేల టన్నుల బొగ్గు ఉత్పత్తి 2.35 లక్షల టన్నుల బొగ్గు రవాణా జరపాలని
సింగరేణి సంస్థ డైరెక్టర్లు ఏరియాల జీఎంలను ఆదేశించారు.
హైదరాబాద్ సింగరేణి భవన్లో శనివారం సంస్థ చైర్మన్ ఎం.డి. ఎన్.శ్రీధర్ ఆదేశంపై అన్ని ఏరియాలలో జనరల్ మేనేజర్లతో ప్రత్యేక
సమీక్షను నిర్వహించారు.

ఈ సమావేశంలో డైరెక్టర్ (ఫైనాన్స్ పర్సనల్) ఎన్. బలరామ్, డైరెక్టర్
(ఈ అండ్ ఎం)డి.సత్యనారాయణరావు, డైరెక్టర్ (ఆపరేషన్స్)ఎన్.వి.కె. శ్రీనివాస్,
డైరెక్టర్ (ప్లానింగ్ అండ్ ప్రాజెక్ట్స్)జి. వెంకటేశ్వర్ రెడ్డి పాల్గొని ఏరియాల వారీగా
సమీక్షించారు. బొగ్గు స్టాకు లు ఉన్న ఏరియాల నుండి రోడ్డు మార్గం ద్వారా రవాణాను పెంచాలని ఆదేశించారు. ఓపెన్ కాస్ట్ గనుల్లో ప్రస్తుతం రోజుకు 14.78 లక్షల క్యూబిక్ మీటర్ల ఓవర్ బర్డెన్ తొలగిస్తున్నామని, దీనిని 16.5 లక్షల క్యూబిక్ మీటర్లకు పెంచాలని కూడా
ఆదేశించారు. గనుల విస్తరణకు సంబంధించిన అనుమతులను వెంటనే సాధించాలని,
వర్షాకాలం ప్రవేశించక ముందే నెలవారీగా నిర్దేశించిన లక్ష్యాలు సాధించుకోవాలని
సూచించారు.
ఈ కార్యక్రమంలో ఇంకా అడ్వైజర్ (మైనింగ్)డి.ఎన్. ప్రసాద్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్
(కోల్ మూమెంట్)జె. ఆల్విన్, జనరల్ మేనేజర్ (కోఆర్డినేషన్)ఎం. సురేష్, జనరల్
మేనేజర్ (మార్కెటింగ్)కె. సూర్యనారాయణ, కొత్తగూడెం కార్పొరేట్ నుండి వివిధ విభాగాల
అధికారులు, ఏరియాల నుండి జీఎంలు వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్షలో పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.

Breaking