సత్య సాయి సేవ భక్త బృందం వారిచే అంగన్వాడి పిల్లలకు పాదరక్షకలు పంపిణీ.
చిట్యాల అక్షిత ప్రతినిధి: చిట్యాల మున్సిపాలిటీ పరిధిలోని సంతోష్ నగర్ లో గల అంగన్వాడి నెంబర్ 2 నందు రెండు నుండి ఐదు సంవత్సరాలలోపు 50 మంది పిల్లలకు సత్యసాయి సేవ భక్త బృందం వారు పిల్లలందరికీ పాదరక్షకాలు, బిస్కెట్లు, చాక్లెట్లు పంపిణీ చేసినారు.

ఈ కార్యక్రమంలో కౌన్సిలర్ జడల పూలమ్మ మల్లేష్ ,మేడిశెట్టి ఝాన్సీ ,చంద నాగలక్ష్మి, మేడిశెట్టి భారతమ్మ, ఏల జ్యోతి, భోగిపర్తి సువర్ణ ,కే పద్మ, అంగన్వాడి టీచర్ దాడి అరుణ ఆయా మమత పిల్లల తల్లిదండ్రులు పాల్గొన్నారు