నవ లిమిటెడ్ పాల్వంచ సామాజిక సేవలు * పాండురంగాపురం జగన్నాధపురంలో శౌచాలయంలు ప్రారంభం

నవ లిమిటెడ్ పాల్వంచ సామాజిక సేవలు

* పాండురంగాపురం
జగన్నాధపురంలో శౌచాలయంలు ప్రారంభం

భద్రాద్రి కొత్తగూడెం అక్షిత ప్రతినిధి:

నవ లిమిటెడ్ పాల్వంచ వారి కార్పోరేట్ సామాజిక బాధ్యత కార్యక్రమాలలో జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల పాండురంగాపురం నందు నిర్మించిన బాలుర శౌచాలయంను మంగళవారం పాఠశాల విద్యా శాఖకు సంబందించిన అస్టిస్టెంట్ మానిటరింగ్ ఆఫీసర్ నాగరాజశేఖర్ స్పెషల్
ఎడ్యుకేషన్ కో ఆర్డినేటర్ సైదులు అతిధిలుగా విచ్చేసి ప్రారంభించారు.

ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ నవ లిమిటెడ్ పాల్వంచ మండలంలో అనేక పాఠశాలలో ఉచిత ట్యూషన్లు మోబైల్ సైన్స్ స్పోకేన్ ఇంగ్లీషు స్టూడెంట్ డెస్క్లు కంప్యూటర్ టీచర్ల ఏర్పాటు వంటి కార్యక్రమాలను చేయటం ద్వారా విద్యా అభివృద్ధికి చేస్తున్న కృషిని
కొనియాడారు. జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల జగన్నాధపురం నందు నిర్మించిన మూత్రశాలలను మండల
పరిషత్ అభివృద్ధి అధికారి జి.రవీంద్ర ప్రసాద్ ప్రారంభించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ ఈ సౌకర్యాలను ఉపయోగించుకుని విద్యార్ధులు ఉన్నత
శిఖరాలను అధిరోహించాలని కోరారు.
ఈ సంధర్భంగా బాగు చేసిన 100 విద్యార్థుల డెస్క్లను నవ లిమిటెడ్ పాఠశాలలకు అందజేయటం జరిగింది.
ఈ కార్యక్రమానికి ఎ.జి.యం మేటిరియల్స్ఎన్ ప్రసాద్, ఎ.జి.యం(సెఫ్టీ)ఎమ్.వి రవీంద్ర,
చీఫ్ లైజనింగ్ ఆఫీసర్ వి.ఖాదరేంద్ర బాబు, చీఫ్ ఆడ్మినిస్ట్రేటర్ డి.శ్యామ్ సుందర్,
సి.యస్.ఆర్ సిబ్బంది, పాఠశాల సిబ్బంది, పాఠశాల యస్.ఎమ్.సి చైర్మెన్ బిచ్చ, విద్యార్ధిని విద్యార్థులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.

Breaking