సమస్యలపై వినతి శాశ్వత పరిష్కారం దిశగా డ్రైన్స్ పనులు దేవి రెడ్డి సుధీర్ రెడ్డి

సమస్యలపై వినతి

శాశ్వత పరిష్కారం దిశగా డ్రైన్స్ పనులు

దేవి రెడ్డి సుధీర్ రెడ్డి

ఎల్బీనగర్, అక్షిత ప్రతినిధి:

మాన్సూరాబాద్ డివిజన్ పరిధిలో వివేకానంద నగర్ పేస్ 2 కాలనీలో డ్రైన్స్ వ్యవస్థ సరిగ్గా లేక తీవ్ర ఇబ్బందులు ఎదురవ్వడం జరుగుతున్నాయి అని కాలనీవాసులు ఎల్.బి.నగర్ శాసనసభ్యులు దేవిరెడ్డి సుధీర్ రెడ్డి కలవడం జరిగింది. ఈ సందర్భంగా సుధీర్ రెడ్డి మాట్లాడుతూ గతంలో మార్నింగ్ వాక్ లో భాగంగా మీరు అట్టి సమస్యలు నా దృష్టికి తీసుకువచ్చారని తెలపడం జరిగింది. అక్కడ ఉన్న మ్యాన్ హోల్స్ కులిపోవడం వల్ల భూగర్భ జలాలు డ్రైనేజీతో కలుషితం కావడం జరిగింది. దానివల్ల అన్ని అపార్ట్మెంట్ లో బోర్ వెల్ నందు కలుషిత నీరు రావడం జరుగుతుంది అని తెలిపారు.అట్టి డ్రైనేజీ తాత్కాలికంగా పక్కన ఉన్న హాస్టల్ పక్క నుంచి మళ్లించడం జరిగింది అని తెలిపారు.అయిన కూడా లోపల లీకేజీలు కావడం జరుగుతుంది అని తెలిపారు. దానిలో భాగంగా మంగళవారం ఎల్.బి.నగర్ సర్కిల్ వాటర్ వర్క్స్ జనరల్ మేనేజర్ వినోద్ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా సుధీర్ రెడ్డి మాట్లాడుతూ అట్టి డ్రైన్స్ లీక్ అయి బోరు నందు పొల్యూషన్ నీరు బయటకు రావడం జరుగుతుంది అని తెలిపారు. కావున డ్యామేజ్ అయిన యూ.జీ.డి. పైప్ లైన్స్ స్థానంలో కొత్త పైప్ లైన్స్ రెండు, మూడు రోజుల్లో వేయాలని ఆదేశించారు. వాటర్ వర్క్స్ జనరల్ మేనేజర్ వినోద్ మాట్లాడుతూ అట్టి పైప్ లైన్స్ దాదాపు18 ఫీట్ల మేర క్రింద డ్రైన్స్ పైప్ లైన్స్ ఉండడం వల్ల కొంత సమయం పడుతుంది అని వారు వివరించారు.దానికి గాను సుధీర్ రెడ్డి సమయం ఎక్కువగా తీసుకోకుండా పనులు యుద్ధప్రాతిపదికన ప్రారంభం చేయాలని ఆదేశించారు. ఇట్టి పనులు సకాలంలో పూర్తి అయితే కాలనీ వాసులకు డ్రైన్స్ సమస్యల నుంచి కొంతమేర స్థాయిలో విముక్తి లభిస్తుంది అని తెలిపారు.రాబోయే రోజుల్లో శాశ్వత పరిష్కారం దిశగా డ్రైన్స్ పనులు చేయడం జరుగుతుందని అన్నారు. ఇట్టి కార్యక్రమంలో
వివేకానంద నగర్ కాలనీ పేస్ 2 అధ్యక్షులు శ్యాంసుందర్ రెడ్డి, సభ్యులు విజయభాస్కర్ రెడ్డి, కిరణ్ కుమార్, భాస్కర్ రెడ్డి, శ్రీరామ్ రెడ్డి, రామకృష్ణా రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.

Breaking