వరంగల్ తూర్పు లో గుడిసె వాసులకు పట్టాలు అందించడం నా బాధ్యత ఎమ్మేల్యే నరేందర్
వరంగల్,అక్షిత బ్యూరో : 27వ డివిజన్ ఎన్.వి.ఆర్ నగర్ లో జీవో 58,59 అమలుకై ఉచిత మీసేవ దరఖాస్తు కేంద్రాన్ని ఎమ్మెల్యే నన్నపునేని నరేందర్ గుడిసేవాసుల కోసం నేడు ప్రారంభించారు.ఈ సందర్భంగా ఎమ్మెల్యే జీవో 58,59 అమలులో బాగంగా నిరుపేదలైన గుడిసేవాసులకు పట్టాలను అందించడమే ద్యేయంగా ముఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వంలో వడివడిగా అడుగులు పడుతున్నాయన్నారు
తూర్పు నియోజకవర్గంలో పేదలకు పట్టాలను అందించాలనే సంకల్పంతో ఈ కేంద్రాన్ని ప్రారంభించామని
దరఖాస్తుకు అయ్యే ఖర్చును తానే వ్యక్తిగతంగా బరిస్తున్నట్టు తెలిపారు
గుడిసేవాసులు ఎవరు డబ్బుకు చెల్లించాల్సిన అవసరం లేదని కేవలం వారికి సంబంధించిన పత్రాలతో మిసేవలో దరఖాస్తు చేసుకోవాలని కోరారు.ఈ కార్యక్రమంలో కార్పొరేటర్ చింతాకుల అనిల్,మాజీ కార్పొరేటర్ జారతి రమేష్,డివిజన్ అధ్యక్షులు పోలేపాక యాకుబ్,బిఆర్ఎస్ నాయకులు మర్రి శ్రీనివాస్,కాలనీ అభివృద్ధి కమిటీ సభ్యులు,ముఖ్య నాయకులు పాల్గొన్నారు