చందా నగర్ డివిజన్ లో ప్రజల తో ప్రజా ప్రతినిధులు, అధికారుల సమీక్షా సమావేశం

చందా నగర్ డివిజన్ లో ప్రజల తో ప్రజా ప్రతినిధులు, అధికారుల సమీక్షా సమావేశం శేరిలింగంపల్లి అక్షిత ప్రతినిధి: చందా నగర్ డివిజన్ పరిధిలోని మధినగూడా దీప్తి శ్రీ నగర్ పార్క్ లో మంగళవారం ఉదయం పదిగంటలకు జి ఎచ్ ఎం సి అధికారులు, వాటర్ వర్క్స్, కరెంట్ డిపార్ట్మెంట్ అధికారుల దోమల నివారణవిభాగం కి సంబందించిన సిబ్బంది స్థానిక కార్పొరేటర్ లు ఈ సమావేశం కీ హాజరు అయ్యీ వివిధ కాలనీ లో నెలకొన్న సమస్యల పట్ల స్పందించి సంబంధిత అధికారులకీ సమస్య పరిష్కారం కోసం చర్యలు తీసుకోవాలని కోరారు ముఖ్యంగా కే ఎస్ ఆర్ లే అవుట్, ఇక్రిశాట్ కాలనీ, శ్రీరామ్ నగర్ చెరువు పరివాహక ప్రాంతంలో ఉండడం వలన కాలనీ వాసుల కీ డ్రైనేజ్ వాటర్ నిలువ ఉండడం వలన దోమలు వృద్ది చెంది కాలనీ వాసుల కీ నిద్ర లేకుండా పోయిందని కార్పొరేటర్ మంజుల రఘునాథ్ రెడ్డి కీ పిర్యాదు చేశారు వారూ వెంటనే ఇంజనీర్ విభాగం వారికీ పోన్ చేసి వెంటనే జెసిబి తో క్లియర్ చేయాలనీ, వారం కీ ఒక సారి పాగింగ్ చేయాలనీ ఆదేశాలు ఇచ్చారు పి.జే.అర్ ప్రధాన రహదారిపై లైట్లు సరిగ్గా లేవూ అని వాటిని వెంటనే ఏర్పాటు చేయాలి అని తెలిపారు ప్రతీ ఆదివారం పార్క్ నుండీ మొదలుకుని అయ్యప్ప దేవాలయం వరకూ కూరగాయల సంత వల్ల ట్రాఫిక్ ఇబ్బందులు పడుతున్నామనీ అయ్యప్ప దేవాలయం వద్ద ప్రభుత్వ భూమిఉంది దానిలోకి శాశ్వతంగా కూరగాయల సంత ను షేడ్ లు వేసి ప్రజల కు ప్రయాణికులకు ఇబ్బందులు తొలగించాలని కోరారు దీప్తి శ్రీ నగర్ సీ బి ఆర్ ఎస్టేట్స్ మెయిన్ రోడ్ పై తోపుడు బళ్ల వల్ల వాహనాల పార్కింగ్ రోడ్ పై నే జరుగుతోంది దీని వల్ల ఎప్పుడూ రద్దీగా ఉంటుంది ఈ విషయము పై చర్యలు తీసుకోవాలని సీనియర్ సిటిజన్ సీతారామయ్య అధికారుల కీ లిఖితూర్వకంగా పిర్యాదు చేశారు. పార్క్ లలో అర్ధరాత్రి మందుబాబుల హల్చల్ అధికం అవుతుంది పార్క్ లలో ఖాళీ సీసాలు పగిలిన గాజు ముక్కలు నిత్యకృత్యంగా మారింది అని పెట్రోలింగ్ వాహనం పార్క్ లపై నిఘా ఉంచాలని యస్.ఐ పి.రాఘవేందర్ కీ పిర్యాదు చేశారు అయన స్పందించి తప్పకుండా పార్క్ లలో నిఘా ఉంచుతామని తెలిపారు. దీప్తి శ్రీ నగర్ ఓటరు లిస్టు ఇంట్లో నాలుగు ఓట్లు ఉంటే నాలుగు దిక్కుల పోలింగ్ కేంద్రాల లో ఉన్నాయని వాటిని సరి చేయాలనీ విన్నవించారు . మంజుల రఘునాథ్ రెడ్డి ఈ విషయమై డిప్యూటీ కమీషనర్ తో మాట్లాడనని త్వరలో అందరికీ సౌలభ్యంగా ఓటు వేసే పరిస్థితి కల్పిస్తామని ఈ సందర్భంగా అన్నారు . ఈ కార్యక్రమంలో డీ.ఏ.ఓ బాలరాజు, తారనగర్ ఏ.ఈ ఉమారాణీ , వాటర్ వర్క్స్ అసిస్టెన్స్ టెక్నికల్ అఫిసర్ కిష్టప్ప, మియాపూర్ లైన్ ఇనస్పెక్టర్ రామచంద్రుడు వివిధ కాలనీ ల నుండీ వచ్చిన ప్రజలు పాల్గొన్నారు

Leave A Reply

Your email address will not be published.

Breaking