నాంపల్లికి వంద పడకల ఆసుపత్రి వచ్చేవరకు ఉద్యమం ఆగదు – అఖిలపక్షాల డిమాండ్

నాంపల్లికి వంద పడకల ఆసుపత్రి వచ్చేవరకు ఉద్యమం ఆగదు

– అఖిలపక్షాల డిమాండ్

నాంపల్లి, అక్షిత న్యూస్:

నాంపల్లి బంద్ సందర్భంగా అఖిలపక్ష నాయకులు మాట్లాడుతూ నాంపల్లి మండలానికి 100 పడక ఆసుపత్రి మంజూరు చేయాలని అఖిలపక్షాలు డిమాండ్ చేయడం జరిగింది ఈ సందర్భంగా నాంపల్లి మండల కేంద్రంలో అన్ని వ్యాపార సముదాయాలు ప్రభుత్వ ఆఫీసులు బందు సంపూర్ణంగా బంద్ చేయడం జరిగింది. స్థానికంగా మునుగోడు నియోజకవర్గంలో ఎమ్మెల్యే తన సొంత ప్రయోజనాల కోసం చౌటుప్పల్లో వంద పడకల ఆసుపత్రి సాంక్షన్ అయిన సందర్భంగా అక్కడ పెట్టుకోవడం దురదృష్టకరమని ఈ సందర్భంగా అఖిలపక్ష నాయకులు ఖండించారు ఇప్పటికైనా ఎమ్మెల్యే కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి సమాధానం చెప్పాలని వెనుకబడిన నాంపల్లికి పెట్టకుండా హైదరాబాద్ పూత పెట్టు దూరంలో ఉన్న హైదరాబాద్ దగ్గరలో ఉన్న చౌటుప్పల్లో పెట్టడం ఇది ఎంతవరకు సమంజసమని మండిపడ్డారు నాంపల్లికి వంద పడకల ఆసుపత్రి మంజూరు అయ్యే వరకు వివిధ రూపాల్లో ప్రజాప్రతిని అధికారులని నిలదీసి నిరసన గ్రామాలలో ఉదృతం చేస్తామని ఈ సందర్భంగా అఖిలపక్ష నాయకులు డిమాండ్ చేశారు టిఆర్ఎస్ ప్రజాప్రతినిధులు నాంపల్లి మండలంలో ఉన్న ప్రజాప్రతినిధులు స్పందించి మీ అభిప్రాయాలను వెల్లడించాలని ఈ సందర్భంగా వారు కోరారు. సిపిఎం పార్టీ మండల కార్యదర్శి నాంపల్లి చంద్రమౌళి, కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు కొమ్ము బిక్షం, పానుగంటి వెంకటయ్య, గాదెపాక వేలాద్రి, గాదెపాక యాదయ్య, నాంపల్లి సంజీవ, సిపిఐ.మండల సహాయ కార్యదర్శి ఊరుపక్క వెంకటయ్య, గిరి స్వామి, కానుగుల మహేష్, బిజెపి నాయకులు పానుగంటి మహేష్ ,నాంపల్లి సతీష్, పూల యాదగిరి,గాదపాక నాగరాజు, బి.ఎస్.పి నాయకులు పూదరి నరసింహ, పల్లెటి వినోద్, టిడిపి మండల్ నాయకులు దానబోయిన నరేష్, మంగి మహేష్, గంగోలి నాంపల్లి శివ, ఎస్కే కాజాబి, నాంపల్లి హనుమంతు, తుంగపాటి జగ్గారెడ్డి,గిరి ఎదుల్ల, కోరి సత్తయ్య,తదితరులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.

Breaking