అగ్నిమాపక సిబ్బంది సేవలు అభినందనీయం… అగ్నిమాపక వారోత్సవాల్లో పాల్గొన్న మంత్రి మల్లారెడ్డి,ఎమ్మెల్యే….

అగ్నిమాపక సిబ్బంది సేవలు అభినందనీయం…

అగ్నిమాపక వారోత్సవాల్లో పాల్గొన్న మంత్రి మల్లారెడ్డి,ఎమ్మెల్యే….

మేడ్చల్, అక్షిత బ్యూరో:
తెలంగాణ రాష్ట్ర విపత్తు స్పందన అగ్నిమాపక సేవల శాఖ అధికారులు మంగళవారం. జీడిమెట్ల ఫైర్ స్టేషన్ వద్ద ఏర్పాటు చేసిన అగ్నిమాపక వారోత్సవాల్లో మంత్రి మల్లారెడ్డి ఎమ్మెల్యే కేపి వివేకానంద్ ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా రక్తదాన శిబిరంను ప్రారంభించారు. అనంతరం అగ్నిప్రమాదాల సమయంలో వినియోగించే యంత్ర సామగ్రి, పరికరాలను పరిశీలించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ప్రమాదాలు సంభవించినపుడు తమ ప్రాణాలను ఫణంగా పెట్టి మంటలను అదుపు చేసేందుకు కృషి చేస్తున్న అగ్నిమాపక సిబ్బంది సేవలు అభినందనీయం అన్నారు.

ప్రజల సేఫ్టీ కొరకు మరికొన్ని ఫైర్ స్టేషన్ లు ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉందని అన్నారు. ఈ కార్యక్రమంలో డిజిఎఫ్ఎస్ వై.నాగిరెడ్డి, డిఎఫ్ఎస్ లక్ష్మీ ప్రసాద్, అడిషనల్ డెరైక్టర్ నారాయణ రావు, రీజనల్ ఫైర్ ఆఫీసర్ పాపయ్య, డిస్ట్రిక్ట్ ఫైర్ ఆఫీసర్ సుధాకర్ రావు, అసిస్టంట్ డిస్ట్రిక్ట్ ఫైర్ ఆఫీసర్ సైదులు, స్టేషన్ ఫైర్ ఆఫీసర్ సుభాష్ రెడ్డి, ఫైర్ మెన్ లు చాంద్ పాషా, జగదీష్ తదితరులు పాల్గొన్నారు…

Leave A Reply

Your email address will not be published.

Breaking