క్రమశిక్షణతో, ఉన్నతవిలువల తో పిల్లలను పెంచాలి – విజయలక్ష్మి,

క్రమశిక్షణతో, ఉన్నతవిలువల తో పిల్లలను పెంచాలి – విజయలక్ష్మి,
శేరిలింగంపల్లి అక్షిత ప్రతినిధి: శేరిలింగంపల్లి మండల పరిధిలోని రాయదుర్గం, దర్గా నాగార్జున ఉన్నత పాఠశాలలో ప్రీ ప్రైమరి గ్రాడ్యుయేషన్ డే వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఇందులో భాగంగా ప్రీ ప్రైమరీ విద్యార్థులు చక్కని డాన్స్లతో అందరినీ అలరించారు. మంచి మంచి గేయాలు పాడుతూ తల్లిదండ్రులను, ఉపాధ్యాయులను మైమరిచిపోయేలా చేశారు. దీనితో పాటు పాఠశాల ఆవరణలో వివిధ రకాల సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించారు. ఈ కార్యకమానికి ముఖ్య అతిధులుగా ఎడ్యుకేషన్ రీజనల్ డైరెక్టర్ విజయలక్ష్మీ , గెజిటెడ్ హెడ్ మాస్టర్ షేక్ తాజ్ బాబా లు విచ్చేసి పిల్లలు చేసిన సాంస్కృతిక కార్యక్రమాలు తిలకించి, వారిని ప్రశంసించారు. విద్య తో పాటూ సాంస్కృతిక కార్యక్రమాలలో కూడా వారిని ప్రోత్సహించడం వల్ల మానసిక ఉల్లాసం పొందడమే కాకుండా వారి లో ఉన్న నైపుణ్యం వెలికి తీసిన వారు అవుతారు అని అన్నారు
ఈ సందర్భంగా విజయలక్ష్మీ మాట్లాడుతూ తన బాల్య జ్ఞాపకాలను గుర్తు చేసుకుంటూ తన తల్లిదండ్రులు వ్యవసాయం చేస్తూ తను ఈ స్థాయిలో ఉండడాని కి కారణమయిన తమ తల్లిదండ్రుల గురించి ఎంతో చెబుతు భావోద్వేగానికి గురయ్యారు. ఎంత వీలయితే అంత సమయానికి తమ పిల్లలతో గడుపుతూ తమ ప్రేమను అందిస్తూ, మంచి క్రమశిక్షణ, ఉన్నత విలువలను అందించడంలో తమ పాత్ర పోషించాలని, చిన్నప్పటి నుండె మంచి పోషక విలువలున్న ఆహారాన్ని అందించి ఆరోగ్యకరమైన జీవితం అందించాలని తల్లిదండ్రులను కోరారు. విద్య మాత్రమే వ్యక్తి వికాసం కీ నాంది అని అన్నారు. చిన్నారులందరూ గ్రాడ్యుయేషన్ దుస్తులు ధరించి ఉన్నత విద్యనభ్యసించడానికి కారణము పట్టభధ్రులు అయినట్లు తమ చేతుల్లో పట్టాలు చూపెడుతూ తమ ఆనందం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో పాఠశాల చైర్మన్ కృష్ణ గౌడ్, కరస్పాండెంట్ భరత్ కుమార్, ప్రధానోపాధ్యాయులు సుందరి. పూర్ణిమ మరియు ఉపాధ్యాయ బృందం పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.

Breaking