బీసీ సబ్ ప్లాన్ ఏర్పాటు చేయాలి
బీసీ సంఘాల ఐక్యవేదిక
మంచిర్యాల, అక్షిత బ్యూరో:–
రాష్ట్ర ప్రభుత్వం బీసీ సబ్ ప్లాన్ ఏర్పాటు చేయడంలో నిర్లక్ష్య వైఖరికి నిరసనగా బీసీ సంఘాల ఐక్యవేదిక ఆధ్వర్యంలో మంగళవారం మంచిర్యాల జిల్లా కేంద్రంలో బైపాస్ రోడ్ లో గల తెలంగాణ తల్లి విగ్రహానికి వినతి పత్రం ఇచ్చి నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ, బీసీ సబ్ ప్లాన్ ఏర్పాటు కొరకు అనేక సంవత్సరాలుగా ఉద్యమాలు చేస్తున్న నేపథ్యంలో 2017 మార్చి బడ్జెట్ సమావేశంలో బీసీ సంఘాల ఆకాంక్షను గుర్తించిన ముఖ్యమంత్రి కేసీఆర్ బీసీ సబ్ ప్లాన్ ఏర్పాటు చేసి చట్టం ఏర్పాటు చేస్తామని, చెప్పి నిండు అసెంబ్లీలో హామీ ఇచ్చి ఆరు సంవత్సరాలు అవుతున్న సబ్ ప్లాన్ పై అడుగు ముందుకు వేయకపోవడమంటే బీసీ లను మబ్బే పెట్టడమే అవుతుందని అన్నారు. ఇప్పటికైనా ఇచ్చిన హామీ ప్రకారం సబ్ ప్లాన్ ఏర్పాటు చేసి చట్ట బద్ధత కల్పించాలని డిమాండ్ చేశారు. లేని పక్షంలో బీసీ సంఘాలుగా ఆందోళన కార్యక్రమాలు నిర్వహిస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో బీసీ సంఘాల ఐక్యవేధిక జిల్లా కన్వీనర్ గుమ్ముల శ్రీనివాస్, కో కన్వీనర్ ఒడ్డెపెల్లి మనోహర్, నస్ఫురి అఖిల్, నాయకులు ఇన్నారం కిరణ్, కల్లా రమేష్ ముదిరాజ్ తదితరులు పాల్గొన్నారు.