నిరుపేదలకు అండగా ఉప్పల చారిట్రబుల్ ట్రస్ట్
కల్వకుర్తి, అక్షిత ప్రతినిధి :
రంగారెడ్డి జిల్లా కల్వకుర్తి నియోజకవర్గం తలకొండపల్లి మండలం వెల్జాల్ గ్రామపంచాయతీ పరిధిలోని ఇస్రాయి పల్లి గ్రామంలో ఉప్పల చారిట్రబుల్ ట్రస్ట్ ద్వారా 27 పూర్తి ఇండ్ల నిర్మాణంలో భాగంగా మంగళవారం నిరుపేద కుటుంబానికి చెందిన 1) రాచాల పల్లి లక్ష్మయ్య 2) ఎద్దుల వెంకటేష్ ఇంటి ఫినిషింగ్ కోసం ఉప్పల చారిట్రబుల్ ట్రస్ట్ చైర్మన్ స్థానిక జడ్పిటిసి ఉప్పల వెంకటేష్ తన ట్రస్ట్ ద్వారా ఇసుక సిమెంట్ ఇప్పించడం జరిగింది నిరుపేద కుటుంబనికి చెందిన రాచాల పల్లి లక్ష్మయ్య ఎద్దుల వెంకటేష్ కుటుంబ సభ్యులు ఉప్పల వెంకటేష్ కి ప్రతేక ధన్యవాదాలు తెలిపారు ఈ కార్యక్రమంలో ఉప సర్పంచ్ అజీజ్, ఎంపీటీసీ మల్లెకిడి అంబాజీ నాయకులు ఆర్ రాజు, వి రాజు , తదితరులు పాల్గొన్నారు