జిల్లా స్థాయి బాల్ బ్యాడ్మింటన్ క్రీడకారులకు కిట్ అందజేసిన కాట శ్రీనివాస్ గౌడ్
రామచంద్రాపురం, అక్షిత ప్రతినిధి :
క్రీడకారులను ప్రోత్సహిoచాలని పటాన్ చెరు నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంఛార్జి కాట శ్రీనివాస్ గౌడ్ అన్నారు. రామచంద్రాపురం పట్టణ పరిధిలోని ఎం.ఐ.జి కి చెందిన జిల్లా స్థాయి బాల్ బ్యాడ్మింటన్ క్రీడకారులకు స్పోర్ట్స్ కిట్ ను అందజేశారు. క్రీడల్లో రాణించాలని, రాష్ట్రానికి, దేశానికి మంచిపేరు తీసుకురావాలని కోరారు. ఈ కార్యక్రమంలో కోచ్ చంటి, జలాల్, బ్లాక్ కాంగ్రెస్ ప్రెసిడెంట్ శ్రీనివాస్, మండల్ ప్రెసిడెంట్ నర్సింగ్ రావు, ఎంపీపీ రవీందర్, ఎంపీటీసీ నాగేందర్ గౌడ్, నాయకులు వీరారెడ్డి, పెంటారెడ్డి, రెహమాన్ తదితరులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.

Breaking