పులా పార్కుగా నిర్మించటమే తమ లక్ష్యం  డబ్బింగ్ యార్డు ఎత్తివేసే విధంగా చర్యలు తీసుకోవాలని సూచన ఎల్బీనగర్ ఎమ్మెల్యే దేవీ రెడ్డి సుధీర్ రెడ్డి

పులా పార్కుగా నిర్మించటమే తమ లక్ష్యం 

డబ్బింగ్ యార్డు ఎత్తివేసే విధంగా చర్యలు తీసుకోవాలని సూచన

ఎల్బీనగర్ ఎమ్మెల్యే దేవీ రెడ్డి సుధీర్ రెడ్డి

ఎల్బీనగర్, అక్షిత ప్రతినిధి:

ఎల్.బి.నగర్  శాసనసభ్యులు  దేవిరెడ్డి సుధీర్ రెడ్డి  మాన్సూరాబాద్ డివిజన్ పరిధిలోని   డంపింగ్ యార్డు నందు కమిషనర్ అండ్ డైరెక్టర్ ఆఫ్ మున్సిపల్  అడ్మినిస్ట్రేషన్ సత్యనారాయణ   కలిసి అట్టి ప్రాంతాల్లో  గురువారం పర్యటించారు. ఈ సందర్భంగా సుధీర్ రెడ్డి   మాట్లాడుతూ 2007వ సంవత్సరంలో బయో మైనింగ్ లో భాగంగా శ్రీ భవాని ఎంటర్ ప్రైజెస్ సంస్థ డంపింగ్ యార్డ్  ఎత్తివేసే విధంగా ఒక ఒప్పందం కుదుర్చుకుంది. అయితే ఒప్పందం ప్రకారం  వారు అట్టి పనులు  చేయలేకపోవడంతో అట్టి సంస్థను సస్పెండ్ చేయడం జరిగింది.అయితే వారు కోర్టుకు పోవడం జరిగింది. ప్రస్తుతం కూడా కోర్టు కేసులో ఉండడం వల్ల డంపింగ్ యార్డు స్థలంలో నిర్మించదలచిన ఫ్లవర్ పార్క్ పనులు ఆగిపోవడం జరిగింది.దానిలో భాగంగా ఎల్.బి.నగర్  శాసనసభ్యులు  దేవిరెడ్డి  సుధీర్ రెడ్డి  జోక్యం చేసుకొని అట్టి విషయాన్ని  మున్సిపల్ శాఖ మంత్రి    కేటీఆర్  దృష్టికి తీసుకెళ్లారు. దానిలో భాగంగా  కేటీఆర్  బయో మైనింగ్ సంస్థ  అయిన శ్రీ భవాని ఎంటర్ ప్రైజెస్ సంస్థ సబ్యులతో  మాట్లాడి కోర్టులో ఉన్న వివాదం సెటిల్మెంట్ చేసుకోవాలని సూచించారు.  అలాగే అదనంగా మరో  మూడు, నాలుగు కంపెనీలతో  ఒప్పందం చేసుకొని  వచ్చే ఆరు నెలల్లో డంపింగ్ యార్డు  ఎత్తివేసే విధంగా చర్యలు  తీసుకోవాలని సూచించారు. దానిలో భాగంగా ఎంతో అనుభవం ఉన్న సమర్థులు అయిన  కమిషనర్ అండ్ డైరెక్టర్ ఆఫ్ మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్  సత్యనారాయణ   ప్రత్యేకంగా నియమించారు. వారు గతంలో మరొక  ప్రాంతాల్లో ఇలా ఉన్న డంపింగ్ యార్డు ఎత్తి వేయించడం జరిగింది. ఈ రోజు ఆటోనగర్ డంపింగ్ యార్డు ప్రాంతంలో అధికారులు, సంస్థ సభ్యులు అట్టి ప్రాంతాల్లో పర్యటించారు. కోర్టులో ఉన్న వివాదం వారం రోజుల్లో పరిష్కారం అవుతుంది అని అశాభావం వ్యక్తం చేశారు. అట్టి వివాదం  పూర్తి కాగానే ముందుగా కంపౌండ్ వాల్ నిర్మించడం  జరుగుతుంది అని తెలిపారు. ప్రతిరోజు అధికారులు మరియు సంస్థ సభ్యుల మీద ఒత్తిడి తేవడం వల్లే ఇప్పుడు ఒక పరిష్కారం దిశగా  సాగుతోంది అని తెలిపారు. రాబోయే రోజుల్లో ఇట్టి డంపింగ్  యార్డు స్థలంలో ఒక అద్భుతమైన పూలవణం నిర్మించి, దేశంలోనే ఒక అత్యుత్తమ  పులా పార్కుగా నిర్మించడమే తమ లక్ష్యం అని తెలిపారు. ఇట్టి కార్యక్రమంలో సంస్థ సభ్యులు నరేష్, మాన్సూరాబాద్ డివిజన్  మాజీ కార్పొరేటర్  కొప్పుల విఠల్ రెడ్డి, డివిజన్ బారాస పార్టీ అధ్యక్షులు  జక్కిడి మల్లారెడ్డి, యువ నాయకులు జక్కిడి రఘువీర్ రెడ్డి, విజయ్ భాస్కర్ రెడ్డి, రాకేశ్,భాస్కర్ యాదవ్ మరియు పలువురు అధికారులు, సంస్థ సభ్యులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.

Breaking