నవభారత్ ఉన్నత పాఠశాలలో డిజిటల్ తరగతుల ఇంటరాక్టివ్ ప్లాట్ ప్యానల్
ప్రారంభం
భద్రాద్రి కొత్తగూడెం అక్షిత ప్రతినిధి:
నవ లిమిటెడ్ పాల్వంచ వారి కార్పోరేట్ సామాజిక బాధ్యత కార్యక్రమాలలో
భాగంగా నవభారత్ ఉన్నత పాఠశాలలో ప్రభుత్వ ఎయిడెడ్ తెలుగు మీడియం
నందు ఏర్పాటు చేసిన డిజిటల్ తరగతి గదులను గురువారం అదనపు కలెక్టర్,
భద్రాద్రి కొత్తగూడెం కె.వెంకటేశ్వర్లు ముఖ్య అతిధిగా విచ్చేసి ప్రారంభించారు.
ఈ సంధర్భంగా ఆయన మాట్లాడుతూ 1981 నుండి 6వ తరగతి నుండి 10వ
తరగతి వరకు ఉచిత విద్యను అందించడమే కాకుండా పాఠశాలలో ఇలాంటి డిజిటల్ తరగతులు ఏర్పాటుచేయటం మేనేజ్మెంట్ యొక్క అంకిత భావానికి ఈ కార్యక్రమం అర్ధం పడుతుందని తెలిపారు.

ఈ పాఠశాలలో విద్యను అభ్యసించిన పూర్వ విద్యార్ధులు వివిధ హెూదాలలో
పనిచేస్తున్నరని వారిని ఆదర్శంగా తీసుకుని మీరు కూడా ఉన్నత స్థానాలకు
ఏదగాలని ఆయన కోరారు.
ఈ కార్యక్రమానికి జనరల్ మేనేజర్ (హెచ్.ఆర్)వి.వి.రాజేశ్వరరావు, చీఫ్ లైజన్
ఆఫీసర్ వి.ఖాదరేంద్ర బాబు, చీఫ్ అడ్మినిస్ట్రేటర్ డి.శ్యామసుందర్,
పాఠశాల ప్రిన్సిపాల్ ఎమ్.వి.ఎస్, రెడ్డి, పాఠశాల సిబ్బంది, సి. యస్.ఆర్ సిబ్బంది,
విద్యార్ధిని, విద్యార్ధులు తదితరులు పాల్గొన్నారు.