దేశాన్ని తాకట్టు పెట్టిన బిజెపిని గద్దె దింపాలి

దేశాన్ని తాకట్టు పెట్టిన బిజెపిని గద్దె దింపాలి

వరంగల్ ,అక్షిత బ్యూరో : సిపిఐ పార్టీ కార్యాలయంలో ఇంటింటికి సిపిఐ అని గోడపత్రిక విడుదల చేయడం జరిగింది ఈ కార్యక్రమంలో
సిపిఐ జిల్లా కార్యదర్శి మేకల రవి మాట్లాడుతూ నిత్యావసర సరుకుల ధరలుపెంచుతూ పేద, మధ్యతరగతి ప్రజల జీవితాలను కేంద్రంలోని మోడీ ప్రభుత్వం దుర్భరం చేస్తుందన్నారు.మరోవైపు కేంద్ర ప్రభుత్వం వేలకోట్ల ప్రజాధనాన్ని కార్పొరేట్ కంపెనీలకు అప్పనంగా దోచిపెడుతున్నదని,రైతులకు రూ.లక్ష రుణమాఫీ చేయలేని కేంద్ర ప్రభుత్వం కార్పొరోట్ కంపెనీలకు లక్షల కోట్ల రూపాయలు రుణమాఫీ చేస్తున్నదని విమర్శించారు. పెరుగుతున్న నిరుద్యోగం, పేదరికం, ద్రవ్యోల్బనం తగ్గించకుండా మత రాజకీయాలు చేస్తూ యువతను పక్కదారి పట్టిస్తూ మోడీ అధికారం అనుభవిస్తున్నాడన్నారు. దేశంలో ఉన్న అన్ని స్వతంత్ర రాజ్యాంగ సంస్థలను తన ఆధీనంలోకి తెచ్చుకొని ఆ మాత్రం మిగిలిన ఉన్న న్యాయవ్యవస్థను కూడా

శాపించటానికి ప్రయత్నాలు ముమ్మరం చేశారని ఆవేదన వ్యక్తం చేశారు. బీజేపీ హఠావో- దేశ్ బచావో..నినాదంతో సీపీఐ జాతీయ సమితి పిలుపుమేరకు ఇంటింటికి సీపీఐ కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతుందన్నారు. ఈపోస్టర్ ఆవిష్కరణలో భాష్మియ గన్నారపు రమేష్ చెన్నకేశవులు శరత్ గోవర్ధన చారి ఉప్పుల రవి యాకోబ్ యోగానంద చారి విక్టోరియా సుమలత యాకయ్య తదితరులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.

Breaking