కంటి వెలుగు కేంద్రాన్ని ప్రారంభించిన ఎంపీపీ కర్ణాకర్
చేర్యాల,ఏప్రిల్ 20 అక్షిత ప్రతినిధి: చేర్యాల మండలంలోని పెద్ద రాజుపేట గ్రామంలో గురువారం జనగామ శాసనసభ్యులు ముత్తిరెడ్డి యాదగిరి రెడ్డి ఆదేశాల మేరకు స్థానిక ఎంపీపీ ఉల్లంపల్లి కరుణాకర్ ఆధ్వర్యంలో రెండవ విడత కంటి వెలుగు కేంద్రాన్ని ప్రారంభించడం జరిగింది.ఈ సందర్భంగా ఎంపీపీ మాట్లాడుతూ తెలంగాణ ప్రజలు ఏ ఒక్కరు కూడా కంటి సమస్యతో బాధపడొద్దు అని అంధత్వ రహిత తెలంగాణను సాధించాలని సంకల్పంతో ముఖ్యమంత్రి కేసీఆర్ ఈ గొప్ప కార్యక్రమం చేప ట్టారని అన్నారు.ఈ కార్యక్రమం ఈనెల 25 తారీకు వరకు కొనసాగుతుందని ప్రజలకు సూచించారు.ఈ కార్యక్రమంలో నూనె వెంకటేష్, ఎంపీటీసీ పోరం అధ్యక్షులు గూడూరు బాలరాజు,ఉపసర్పంచ్ రాము, క్యాంపు మెడికల్ ఆఫీసర్ రమ్య, పంచాయతీ కార్యదర్శి రమేష్, ఏఎన్ఎం రాజా రీడికా, మరియు యూత్ అధ్యక్షుడు బాలకిషన్, నాయకులు నర్సింలు, బాల గౌడ్ తదితరులు పాల్గొన్నారు.