కొత్తగూడెం ఏరియాలోని జికేఓసిని సందర్శించిన సింగరేణి డైరక్టర్
భద్రాద్రి కొత్తగూడెం అక్షిత ప్రతినిధి:
కొత్తగూడెం ఏరియా పరిధిలోని జిఎం కార్యాలయము జికేఓసి ఉపరితల గనిలో గురువారం సింగరేణి డైరక్టర్ (పి అండ్ పి) జి.వేంకటేశ్వర రెడ్డి పర్యటించారు.
ముందుగా జిఎం కార్యలయం నందు బొగ్గు ఉత్పత్తి ప్రతిపాదిత వికేఓసి ప్రాజెక్టుపనుల గురించి సంబంధిత అధికారులతో సుధీర్ఘముగా చర్చించారు.

అనంతరం జికేఓసి ఉపరితల గని వ్యూ పాయింట్ నుండి జికేఓసి ఉపరితల గనిని పరిశీలించి జికేఓసిల ఉపరితల గని నందు మిగిలి ఉన్న బొగ్గును వేగవంతంగా రక్షణతో కూడిన ఉత్పత్తి చేయాలని అదే విధముగా ప్రతిపాధిత వికేఓసి ప్రొజెక్ట్ పనులను కూడా త్వరగతిన పూర్తి చేయాలని సంబంధిత అధికారులతో సుధీర్ఘముగా చర్చించారు.
ఈ కార్యక్రమంలో కొత్తగూడెం ఏరియా ఇంచార్జ్ జిఎం ఎన్.సుధాకరరావు, జిఎం సిపిపి సిహెచ్.నరసింహా రావు, వికేఓసి పిఓ రమేష్, జికేఓసిక మేనేజర్ ఎస్ఎస్ఆర్ మురళి, డిజిఎం సర్వే సదానందం, సీనియర్ సెక్యూరిటీ ఆఫీసర్ రమణా రెడ్డి ఇతర అధికారులు పాల్గొన్నారు.