విద్యార్థులు సామాజిక మాద్యమాలకు బానిసలు కావద్దు ఎస్.ఐ లక్ష్మయ్య ఎస్.ఎఫ్.ఐ ఆద్వర్యంలో విద్యార్థులపై మీడియా ప్రభావం అంశంపై సెమినార్
విద్యార్థులు సామాజిక మాద్యమాలకు బానిసలు కావద్దు
ఎస్.ఐ లక్ష్మయ్య
ఎస్.ఎఫ్.ఐ ఆద్వర్యంలో విద్యార్థులపై మీడియా ప్రభావం అంశంపై సెమినార్
నకిరేకల్ అక్షిత ప్రతినిధి:
విద్యార్థులు సోషల్ మీడియాకు బానిసలు కాకుండా కష్టపడి చదివి ఉన్నత శిఖరాలు అవరోదించాలని స్థానిక ఎస్. లక్ష్మయ్య అన్నారు. ఎస్.ఎఫ్.ఐ ఆద్వర్యంలో స్థానిక ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో విద్యార్థులపై మీడియా ప్రభావం,ఆడపిల్లలపై జరిగె అత్యాచారాలు అరికట్టే మార్గాలు అనె అంశంపై సెమినార్ నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన ఎస్.ఐ లక్ష్మయ్య మాట్లాడుతూ ప్రస్తుతం సమాజంలో వేదింపులు,మోసాలు సామాజిక మాద్యమాల ద్వారానే జరుగుతున్నాయన్నారు. సైబర్ క్రైమ్,రక్షణ చట్టాల పట్ల విద్యార్థులు అవగాహనతో ఉండాలన్నారు. క్రమశిక్షణతో చదివి ఉన్నతమైన స్థాయిలో నిలిస్తేనే కన్న తల్లిదండ్రుల కలలు నెరవేర్చినవారవుతారన్నారు.

ప్రపంచం వేగంగా దూసుకుపోతున్న తరుణంలో విద్యార్థుల ఆలోచనా,శ్రమ మరింత కఠినంగా ఉండాలన్నారు. ప్రతీ ఒక్కరు లక్ష్యాన్ని ఏర్పరచుకుని ముందుకు పోవాలని పిలుపునిచ్చారు.ఎస్.ఎఫ్.ఐ మండల అధ్యక్షుడు మేకల జలెందర్ అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో కళాశాల ప్రిన్సిపల్ కమల,ఎస్.ఎఫ్.ఐ మాజీ జిల్లా కార్యదర్శి బొడ్డుపల్లి వెంకటేశం,కేంద్ర కమిటి సభ్యురాలు మెడబోయిన మమత,ప్రజానాట్యమండలి జిల్లా అధ్యక్షుడు గంటెపాక శివ కుమార్,డి.వై.ఎఫ్.ఐ నాయకుడు మేడి మధుబాబు,ఇప్రలపల్లి మత్స్యగిరి,భూడిద మనోహర్ తదితరులు పాల్గొన్నారు.