*పెద్ద దిక్కును పోగొట్టుకున్న పేద కుటుంబానికి ఆర్థిక సహాయం చేసిన మాజీ ఎమ్మెల్యే
*చిట్యాల,అక్షిత ప్రతినిధి:
ఇటీవల అనారోగ్యంతో బాధపడుతూ మృతి చెందిన చిట్యాల మున్సిపాలిటీ పరిధిలోని 1వ వార్డ్ శివనేనిగూడెం గ్రామానికి చెందినా నాగిళ్ళ కృష్ణ కుటుంబ సభ్యులకు నకిరేకల్ మాజీ ఎమ్మెల్యే వేముల వీరేశం 10000 వేల రూపాయలు ఆర్థిక సాయం వారి అనుచరులచే పంపడం జరిగింది.ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీటీసీ ఎద్దులపూరి క్రిష్ణ, ఏర్పుల పరమేష్, కుక్కల మోహన్, నూతి సైదులు, అమరోజు నవీన్ కుమార్,కూరేళ్ల యాదయ్య ,తడూరి చంద్రం,కోసనం అశోక్, అమరోజు మదన్, దగ్గుల సైదులు తదితరులు పాల్గొన్నారు