గఫూర్ ఫౌండేషన్ సేవలు అభినందనీయం. రంజాన్ పర్వదినం సందర్భంగా పేద ముస్లింలకుచేయూత. దానధర్మాలతోనే గుర్తింపు ఎమ్మెల్యే బొల్లం మల్లయ్య యాదవ్.

గఫూర్ ఫౌండేషన్ సేవలు అభినందనీయం.

రంజాన్ పర్వదినం సందర్భంగా పేద ముస్లింలకుచేయూత.

దానధర్మాలతోనే గుర్తింపు

ఎమ్మెల్యే బొల్లం మల్లయ్య యాదవ్.

కోదాడ టౌన్ ,అక్షిత న్యూస్:

గఫూర్ ఫౌండేషన్ చేస్తున్న సామాజిక సేవలు అభినందనీయమని కోదాడ శాసనసభ్యులు బొల్లం మల్లయ్య యాదవ్ అన్నారు. గురువారం కోదాడ పట్టణంలోని ఏ ఆర్,ఏ ఆర్ ఫంక్షన్ హాల్ లో నియోజకవర్గ వ్యాప్తంగా ఉన్న ఇమామ్ సబ్, మౌజాన్ సబ్, పేద ముస్లింలు, వికలాంగులు, వృద్ధులకు గఫూర్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో 13 లక్షల రూపాయల విలువ చేసే రంజాన్ తోఫాలను ఫౌండేషన్ వ్యవస్థాపకులు గఫూర్ మేస్త్రి తో కలిసి ఆయన పంపిణీ చేసి మాట్లాడారు. రంజాన్ మాసం పవిత్రమైనదని దాన ధర్మాలతో పేద ముస్లింలకు చేయూతను అందించడంతో పుణ్యం వస్తుందన్నారు.

ప్రజలందరూ సుఖ సంతోషాలతో ఉండాలనే ప్రభుత్వా లక్ష్యంలో భాగస్వాములు అవుతూ ప్రజా ప్రతినిధులు, బిఆర్ఎస్ నాయకులు గఫూర్ మేస్త్రిని ఆదర్శంగా తీసుకొని సేవా కార్యక్రమాలు చేస్తుండాలన్నారు, సేవా కార్యక్రమాలతోనే ప్రజల్లో తగిన గుర్తింపు వస్తుందన్నారు.ఈ కార్యక్రమంలో తహసిల్దార్ శ్రీనివాస్ శర్మ, మైనార్టీ నాయకులు షేక్ నయీమ్,అఫ్జల్, సాదిక్, అబ్దుల్ ఖాదర్, మాజీ సర్పంచ్ పైడిమర్రి సత్తిబాబు, వెంపటి మధుసూదన్, షేక్ మహిముద్, అబ్బు, ఫయాజ్, యూసుఫ్ భాయ్, మస్తాన్, దొంగరి శ్రీను, సద్దాం, మీగడ రామకృష్ణ,జానీ తదితరులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.

Breaking