ఇండియన్ స్కౌట్స్ అండ్ గైడ్స్ ఫెలోషిప్ ఆధ్వర్యంలో రంజాన్ కానుకలు పంపిణీ
భద్రాద్రి కొత్తగూడెం అక్షిత ప్రతినిధి:
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా లక్ష్మీదేవిపల్లి మండలం శ్రీనగర్ కాలనీ గ్రామపంచాయతీ పరిధిలోని ఇందిరా నగర్ కాలనీ ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో గురువారం ఇండియన్స్ స్కౌట్స్ అండ్ గైడ్స్ ఫెలోషిప్ ఆధ్వర్యంలో నిరుపేద ముస్లింలకు రంజాన్ కానుకలను పంపిణీ చేయడం జరిగింది.

ఈ కార్యక్రమంలో ఎస్ జి ఎఫ్ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అధ్యక్షుడు లోగాని శ్రీనివాస్,
రాష్ట్ర ఉపాధ్యక్షుడు, జిల్లా ప్రధాన కార్యదర్శి మహమ్మద్ ఖాసీం, జిల్లా ఉపాధ్యక్షుడు చిట్టిమల్ల బ్రహ్మం చారి, నసీమ్ పాషా, పాఠశాల హెచ్ఎం. జ్యోతి రాణి, విద్యా కమిటీ చైర్మన్ చాంద్ పాషా, టీచర్లు శౌరి ఇన్నయ్య, సరస్వతి, పేరెంట్ టీచర్ కళ్యాణి తదితరులు పాల్గొన్నారు.