ఘనంగా చంద్రబాబు నాయుడు జన్మదిన వేడుకలు

ఘనంగా చంద్రబాబు నాయుడు జన్మదిన వేడుకలు

చేర్యాల,ఏప్రిల్ 20 అక్షిత ప్రతినిధి:
నారా చంద్రబాబునాయుడు జన్మదినం సందర్భంగా గురువారం చేర్యాల మున్సిపల్ పట్టణంలోని అంబేద్కర్ చౌరస్తా వద్ద తెలంగాణ రాష్ట్ర టిడిపి అధికార ప్రతినిధి ఒగ్గు రాజు ఆధ్వర్యంలో కేక్ కట్ చేసిన అనంతరం స్థానిక ఏరియా ప్రభుత్వ ఆసుపత్రిలో రోగులకు పండ్ల పంపిణీ చేయడం జరిగింది.ఈ సందర్భంగా ఒగ్గు రాజు మాట్లాడుతూ మన తెలంగాణ ప్రాంతం అభివృద్ధి చెందింది అంటే, టిడిపి ప్రభుత్వ అధికారంలో ఉన్న నర్రా చంద్రబాబు నాయుడు కారణమని అన్నారు.తెలంగాణలో ఐటీ రంగం గానీ సాఫ్ట్వేర్ గాని ఇన్ఫోసిస్ గాని బయోటెక్ కానీ నల్సార్ గాని అనేకమైనటువంటి కంపెనీలు సంస్థలు తీసుకువచ్చిన ఘనత తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు నర్రా చంద్రబాబు నాయుడు కె దక్కిందని గుర్తు చేశారు.రానున్న కాలంలో తెలుగుదేశం పార్టీ రెండు తెలుగు రాష్ట్రాలలో అధికారంలోకి రావడం ఖాయమని తెలియజేశారు.ఈ కార్యక్రమంలో చేర్యాల పట్టణ అధ్యక్షులు మిట్టపల్లి నారాయణరెడ్డి,ప్రధాన కార్యదర్శి బిర్లా శ్రీరాములు, మండల ఉపాధ్యక్షులు కూరారం బాల నరసయ్య, ఎండి ఇక్బాల్, ఎడమల శ్రీనివాస్ రెడ్డి, పాము శివలింగం, కమలాపురం కిష్టయ్య తదితరులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.

Breaking