వి ఓ ఏ ల సమస్యలు పరిష్కరించి, ఉద్యోగభద్రత కల్పించాలి – సుధా శ్రీనివాస్ గౌడ్
జిన్నారం, అక్షిత ప్రతినిధి : పటాన్ చెరు నియోజకవర్గంలో గల
గుమ్మడిదల మండల కేంద్రంలో ఐకెపి, వి ఓ ఏ (విలేజ్ ఆర్గనైజింగ్ అసిస్టెంట్) ల సమ్మెకు. సంగారెడ్డి జిల్లా మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు కాట సుధాశ్రీనివాస్ గౌడ్ మద్దతు తెలిపి, ఐ.కె.పి వి ఓ ఏ ల సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేశారు. సెర్ప్ ఉద్యోగులుగా గుర్తించి ఉద్యోగ భద్రత కల్పించాలని, కనీస వేతనం 26 వేల రూపాయలు గా నిర్ణయించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో బ్లాక్ కాంగ్రెస్ శ్రీనివాస్ రెడ్డి, మండల ప్రెసిడెంట్ నర్సింగ్ రావు, మాజీ అధ్యక్షుడు మద్ది వీరారెడ్డి, ఎంపీటీసీలు నాగేందర్ గౌడ్, గోవర్ధన్ గౌడ్, బాలకృష్ణగౌడ్ శంకర్ యాదవ్, వెంకటేష్, నర్సింహరెడ్డి, ఆంజనేయులు, మహిపాల్ రెడ్డి, కిష్టగౌడ్, రాంరెడ్డి బాసిరెడ్డి, కొత్తపల్లి రాజు, శ్రీనివాస్ వినోద్,అశం, మహిపాల్ రెడ్డి, అశోక్ గౌడ్, భాస్కర్, సుధాకర్, మల్లేష్ యాదవ్, దయాకర్ రెడ్డి బాలరాజుయాదవ్, వాసుదేవరెడ్డి సురేష్ గౌడ్, హరీష్, రోహిత్ రెడ్డి, సందీప్, యాదగిరి, ఆజార్, రాజు, గోపాల్ రెడ్డి, శంకర్, శిరీష, కృష్ణ తదితర నాయకులు పాల్గొన్నారు.