కోదాడ మండలాన్ని ఆదర్శ మండలంగా అభివృద్ధి చేస్తా వేసవికాలంలో నీటి ఎద్దడి సమస్యలు తలెత్తకుండా చూడాలి ప్రజా ప్రతినిధులు, అధికారులు సమన్వయంతో పనిచేయాలి ఎమ్మెల్యే బొల్లం మల్లయ్య యాదవ్ .

కోదాడ మండలాన్ని ఆదర్శ మండలంగా అభివృద్ధి చేస్తా

వేసవికాలంలో నీటి ఎద్దడి సమస్యలు తలెత్తకుండా చూడాలి

ప్రజా ప్రతినిధులు, అధికారులు సమన్వయంతో పనిచేయాలి

ఎమ్మెల్యే బొల్లం మల్లయ్య యాదవ్ .

కోదాడ టౌన్, అక్షిత న్యూస్:

కోదాడ మండలాన్ని ఆదర్శ మండలంగా అభివృద్ధి చేస్తానాని కోదాడ అభివృద్ధి ప్రధాత, శాసనసభ్యులు బొల్లం మల్లయ్య యాదవ్ అన్నారు. గురువారం కోదాడ మండలం సర్వసభ్య సమావేశంలో ఎమ్మెల్యే బొల్లం మల్లయ్య యాదవ్ ముఖ్య అతిధిగా పాల్గొని మాట్లాడుతూ, భగీరథ ద్వార గ్రామాల్లో సురక్షిత త్రాగునీటి అందించడం జరుగుతుంది అని ఆయన గుర్తు చేశారు. వేసవికాలంలో ప్రతి గ్రామానికి మిషన్ భగీరథ నీరు అందేలా చూడాలి అని ఆయన కోరారు. యాసంగి ధాన్యం కొనుగోలు విషయంలో అధికారులు, ప్రజాప్రతినిధులు రైతులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చూడాలని సూచించారు. ఇంకా ధాన్యం కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయని చోట త్వరగా ఏర్పాటు చేయాలని సూచించారు. ప్రజాప్రతినిధులు,అధికారులు సమన్వయంతో పని చేయాలి ఆయన కోరారు.తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రారంభించిన పల్లె ప్రగతి కార్యక్రమంతో గ్రామాలు సర్వతోముఖాభివృద్ధి చెందుతున్నాయని ఆయన అన్నారు.ప్రత్యేక రాష్ట్రం ఆవిర్భవించిన తర్వాత పల్లెలన్నీ క్రమక్రమంగా ప్రగతి పథంలో పయనిస్తున్నాయని అన్నారు.గ్రామాల్లో గుణాత్మక మార్పు కోసం సీఎం కేసీఆర్ విశేష కృషి చేస్తున్నారని అన్నారు.స్థానిక సంస్థల బలోపేతానికి ప్రభుత్వం కృషి చేస్తుంది అని ఆయన అన్నారు.

గ్రామాలలో అధికారులు తిరిగి సమస్యలు గుర్తించి వాటిని పరిష్కరించాలని ఆయన కోరారు.అధికారులు ప్రజా ప్రతినిధులు సమన్వయంతో పని చేయాలి అని సూచించారు.పనులలో అధికారులు అలసత్వం వహించ వద్దు అని అన్నారు.అధికారులు ప్రజల పట్ల నిర్లక్ష్యం వహించకుండా ప్రజా ప్రతినిధులు తమ గ్రామాలకు అభివృద్ధి కోసం అడిగే పనులను తప్పకుండా చేయాలని ఆయన అన్నారు.విధుల పట్ల నిర్లక్ష్యం వహిస్తే ఉపేక్షించేది లేదని, అధికారులు ప్రతి ఒక్కరు తమ యొక్క విద్యుక్త ధర్మాన్ని పాటించాలని ఆయన అన్నారు. మండలానికి సంబంధించి అన్ని విధాలుగా అభివృద్ధి పనులు జరుగుతున్నాయని ,రాబోయే రోజుల్లో ముఖ్యమంత్రి కెసిఆర్ నాయకత్వంలో కోదాడ మండలాన్ని అన్ని విధాలుగా అభివృద్ధి చేసేందుకు కృషి చేస్తానని ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ చింత కవిత రాధా రెడ్డి, వైస్ ఎంపీపీ మల్లెల రాణి బ్రహ్మయ్య, ఎంపీడీవో విజయ, ఆయా గ్రామాల సర్పంచులు, ఆయా గ్రామాల ఎంపీటీసీలు, సొసైటీ చైర్మన్లు, ఆయా శాఖల మండల అధికారులు, తదితరులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.

Breaking